• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీచర్లకు గుడ్‌న్యూస్.. జాబితా విడుదల

VZM: జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియలో భాగంగా తాజా సీనియారిటీ జాబితాను విడుదల చేశారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో తప్పులు ఉంటే నేటి నుంచి ఈనెల 26 వరకు DEO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

April 21, 2026 / 11:43 AM IST

‘వివరాల సేకరణలో ఖచ్చితత్వం ఉండాలి’

NDL: సంజామల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జనగణన కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణలో భాగంగా సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తహాసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ట్రైనర్లు శ్రీనివాసులు, రాజశేఖర్ జనగణన విధానాలు, ఇంటింటి వివరాల సేకరణ, గృహాల లెక్కింపు, నమోదు ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.

April 21, 2026 / 11:29 AM IST

చిన్నారులను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచండి: సీడీపీవో

TPT: చిన్నారులను చిన్నతనం నుంచే ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచాలని గూడూరు సీడీపీవో మెహబూబీ కోరారు. మంగళవారం గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తిలక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి విద్యార్థులు ఆటపాటలపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

April 21, 2026 / 11:24 AM IST

ఇంద్రకీలాద్రిపై శంకరాచార్య జయంతి ఉత్సవాలు

NTR: వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొండపై ఉన్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పల్లకీ సేవ ప్రాంతంలో శంకరాచార్య స్వామి విగ్రహానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం భక్తులు పూజలు చేశారు.

April 21, 2026 / 11:14 AM IST

జిల్లాలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం

CTR: రొంపిచర్ల జడ్పీ బాయ్స్ హై స్కూల్‌కి చెందిన టీచర్లు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఫజులుపేటలో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించమని ఉపాధ్యాయులు అడుగుతున్నారు. పాఠశాలలో విద్యాపరంగా ఎదుగుదలకు ఉన్న వసతుల గురించి వివరిస్తూ పిల్లల నమోదుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో HM ధనలక్ష్మి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

April 21, 2026 / 11:14 AM IST

పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: కేంద్ర ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే పద్మ పురస్కారాలు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారు, పాల్గొన్న వారు అర్హులని చెప్పారు. దరఖాస్తు ఫామ్‌లు https://awards.gov.inలో⁠ లభిస్తాయని, మే 15లోపు ఆ వివరాలను తమకు అందజేయాలని ఆయన సూచించారు.

April 21, 2026 / 11:13 AM IST

సెల్ఫ్ ఎన్యూమరేషన్ పేరుతో సైబర్ మోసాలు

ELR: సెల్ఫ్ ఎన్యూమరేషన్’ స్వయం నమోదు దశ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. సెన్సస్ అధికారులమంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపి ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందన్నారు. జనగణన పేరుతో ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు లేదా OTP అడిగితే ఇవ్వొద్దని అన్నారు.

April 21, 2026 / 11:12 AM IST

దాహార్తి తీర్చేందుకు ముందుకొచ్చిన యువత

తూ.గో: సీతానగరం మండలం నాలుగు బొమ్మ సెంటర్‌లో యూత్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా CPI(ML) రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు హాజరై ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక యువత భారీగా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

April 21, 2026 / 11:07 AM IST

ఈనెల 25న జడ్పీ సర్వ సభ్య సమావేశం

ATP: ఈ నెల 25న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. శనివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన అజెండాను తయారు చేశారు. జిల్లా అధికారులు సమర్పించిన ప్రగతి నివేదికపై చర్చ, తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

April 21, 2026 / 11:07 AM IST

విద్యార్థినులకు ఘన సన్మానం

సత్యసాయి: కదిరి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ సీఎం వెంకటేశ్వర్ ప్రసాద్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థినులంతా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

April 21, 2026 / 11:06 AM IST

ఆశ వర్కర్లచే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

TPT: మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎవరు కూడా బయట తిరగవద్దని ముఖ్యంగా చెట్ల కింద సేద తీరాలని, అలాగే కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాచి చల్లార్చిన నీటిలో కలుపుకుని తాగాలని సూచించారు.

April 21, 2026 / 11:05 AM IST

అన్నా క్యాంటీన్‌కు 20,000 విరాళం అందజేత

VZM: CM చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని గజపతినగరం మండలం ఎం. గుమడం గ్రామానికి చెందిన రిటైర్డ్ విఆర్ఓ బైరెడ్డి నారాయణ వారి కుమారులు ఉదారత చాటుకున్నారు. ఒకరోజు అన్న సమారాధన కోసం రూ. 20 వేలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అందజేశారు. ఇదే విధంగా ప్రతి ఏడాది ఒక రోజు విరాళం అందజేయడానికి అంగీకరించారు. TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి పాల్గొన్నారు.

April 21, 2026 / 11:03 AM IST

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

KRNL: ఆదోని శివారు కొండలలోని శ్రీ రణమండల ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేష దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చనలు, అభిషేకాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా కమిటీ సభ్యులు సకల ఏర్పాట్లు చేశారు.

April 21, 2026 / 10:54 AM IST

డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోండి: నగర కమిషనర్

నెల్లూరు: బుచ్చి పట్టణంలో కమిషనర్ చినబాబు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి రోడ్లమీద చెత్త వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. చెత్తను ప్రతిరోజు ఎప్పటికప్పుడు తరలించారని అధికారులకు ఆదేశించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు.

April 21, 2026 / 10:51 AM IST

క్రేన్ సాయంతో బయటకు వచ్చిన లారీ డ్రైవర్

కృష్ణా: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌ను ఎట్టకేలకు బయటకు తీశారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద చెట్లకు నీళ్లు పోస్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ లోపలే ఇరుక్కుపోయాడు. సుమారు అరగంటపాటు శ్రమించి క్రేన్ సహాయంతో బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.

April 21, 2026 / 10:46 AM IST