NDL: సంజామల మండలం మంగపల్లెలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 67వ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు డైరెక్టర్ పి.మౌలాలి రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి నెల ఈ శిబిరాలు నిర్వహిస్తున్ననట్లు పేర్కొన్నారు. వివిధ వ్యాధులకు నిపుణ వైద్యులచే సేవలందించి, సుమారు 1000 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు.
KDP: పోరుమామిళ్లలో డీజల్, పెట్రోల్ కొరత ఉదంటూ సీపీఐ నేతలు ఆదివారం నిరసన చేపట్టారు. ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి రోడ్డుపై లాగారు. అధికారులు జిల్లాలో ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. యాజమాన్యాలు ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారా అని ఆరోపించారు.
W.G: ఉండి మండలం ఉప్పులూరరు లో శ్రీ చెన్నకేశ్వవస్వామివారి తిరుకల్యాణం ఈ 28 న జరుగుతుందని ఆలయ ఛైర్మన్ యర్రా వెంకట సుబ్బారావు తెలిపారు. ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రాంభమైనట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల 2 వ తేదివరకు స్వామి వారి మహోత్సవాలు జరుగుతాయి అన్నారు. ఈ నెల 27 శేష వాహన సేవ, 28 న గరుడ వాహన సేవ 30న హనుమ సేవ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయిని ఆయన తెలిపారు.
KKD: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ఈశ్వరరాజు వర్మ ఆదివారం తెలిపారు. కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. ఇందులో రచన, సైన్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు.
ELR: ముసునూరు గ్రామంలో శ్రీ వేంకటాచల స్వామి శ్రీదేవి, భూదేవి (గోదాదేవి) పరివార దేవతామూర్తుల నూతన విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహా కుంభాభిషేకం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రకాశం: హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రాజ్ కుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టి, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన స్పందిస్తూ, న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. స్థానిక ప్రజలతో సమన్వయం పెంపొందించి, చట్టం అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.
CTR: వేదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఉభయ దాతలుగా చంగల్రాయ రెడ్డి కుటుంబం కళ్యాణాన్ని నిర్వహించగా, బండి నాగిరెడ్డి, పరంధామ రెడ్డి వస్త్రాలు సమర్పించారు.
పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండలోని NSP జిల్లా పరిషత్ పాఠశాలలో బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇవాళ ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గతంలోనే టీడీపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచిందని గుర్తు చేశారు.
ATP: శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా MLA కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలోని వాసవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్త్రీ శక్తికి నిదర్శనమైన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులకు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అందరికీ సకల శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఆర్యవైశ్య ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి ఐతానగర్లో శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మే 1 వరకు జరిగే వేడుకల్లో అఖండ దీపం, ఊరేగింపు, గుమ్మడి సిడి, జల బిందెలు, పూలకప్పెర వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం పొంగళ్లు, మొక్కుబడులతో ఉత్సవాలు ముగుస్తాయి.
AKP: సింగపూర్ పర్యటనలో భాగంగా 6వ రోజు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై అధ్యయనం చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏదైనా ఓ సమస్య ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఒక టీంగా ఏర్పడి పరిష్కరించడానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకున్నామన్నారు. దీనిపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారన్నారు.
SKLM: స్వీయ గణన మనందరి బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జనాభా గణనలో భాగంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5కె రన్ ర్యాలీ నిర్వహించారు. స్వీయ గణన ప్రతి ఒక్క పౌరుని బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, జేసీ, అధికారులు పాల్గొన్నారు.
ELR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చింతలపూడి ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసపత్రులలో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆసుపత్రిక కావలసిన మౌలిక సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
KRNL: బేతంచెర్లలోని అమ్మవారి శాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవీ మహిళా మండలి సభ్యులతో కలిసి 46 మంది దంపతులు సామూహిక హోమంలో పాల్గొన్నారు. ముందుగా జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల సందడి నెలకొంది. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులుహాజరవుతున్న నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రకటించారు. కావున ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.