• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సమాజానికి మార్గదర్శకంగా మీడియా ఉండాలి: కలెక్టర్

KDP: మీడియా వార్తలు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని, జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. కడప ZP మందిరంలో రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు 2 రోజుల పునశ్చరణ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రజలకు ఉపయోగపడే వార్తలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.

May 30, 2026 / 04:44 PM IST

‘క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

W.G: భీమవరంలో శనివారం జరిగిన ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్, పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో బహిరంగంగా చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి స్టీల్ గ్లాసులను ప్రోత్సహించాలని సూచించారు.

May 30, 2026 / 04:43 PM IST

సీతం ప్రొఫెసర్ ఘనత.. MRI పరికరానికి పేటెంట్

VSP: సీతం ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై. దినేష్ కుమార్ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. ఆయన భాగస్వామ్యంతో రూపొందించిన వినూత్న ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం డిజైన్‌కు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం అధికారికంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ ఘనతపై కళాశాల డైరెక్టర్ శశిభూషణ రావు ఆయనను అభినందించారు.

May 30, 2026 / 04:40 PM IST

కరాలపాడులో పోలీసుల తనిఖీలు

PLD: పిడుగురాళ్ల మండలం కరాలపాడులో పోలీసులు శనివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల డీఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. పిడుగురాళ్ల డివిజన్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. గ్రామంలోని పలు ఇళ్లలో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ తనిఖీలు చేశారు.

May 30, 2026 / 04:39 PM IST

జలధార – జలహారతి పనులు పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: గిద్దలూరు (మం) క్రిష్టంశెట్టి పల్లె పంచాయతీ పరిధిలోని ఉప్పలపాడులో శనివారం జలధార – జలహారతి కార్యక్రమం కింద మంజూరైన అభివృద్ధి పనులను ఎంపీడీవో కే. సీతారామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, కూలీలతో మాట్లాడి కార్యక్రమం లక్ష్యాలు, పనుల నిర్వహణ విధానం, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు.

May 30, 2026 / 04:34 PM IST

రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

కృష్ణా: రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కాలువలు అభివృద్ధి చేస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్ రాజ్ పంట కాలువలో జరుగుతున్న ఉపాధి హామీ పూడిక తీత పనులను శనివారం పరిశీలించారు. ఎండల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలంటూ కూలీలకు ఎమ్మెల్యే సూచించారు.

May 30, 2026 / 04:31 PM IST

‘శాస్త్రీయ భావజాలాన్ని అలవర్చుకోవాలి’

WG: బాలబాలికల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జన విజ్ఞాన వేదిక (D) అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కోరారు. ఆకివీడులో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఈస్ట్ పాలెం స్కూల్లో జరుగుతున్న వేసవి వినోదం కార్యక్రమంలో శనివారం మ్యాజిక్ షో ప్రదర్శించారు. పిల్లలు మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా చూడాలన్నారు.

May 30, 2026 / 04:30 PM IST

సేవలతో మన్ననలు పొందిన డా. రమణ

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎస్‌.ఎస్‌.వీ. రమణ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. జింఖానా బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో డా. రమణను ఘనంగా సత్కరించారు. నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వహించిన డా. రమణ సేవలు ఆదర్శప్రాయమన్నారు.

May 30, 2026 / 04:27 PM IST

పీహెచ్‌సీలో మంత్రి ఆకస్మిక తనిఖీలు

VZM: జామి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి, బాలింతలు ఉండే గది అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఆసుపత్రి సిబ్బంది పనితీరులో ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతలో మార్పు రావాలని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.

May 30, 2026 / 04:26 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

KDP: మైదుకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. యువతకు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్న లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణను నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ విద్యను పూర్తి చేసినవారు, అంతకంటే విద్యార్హత ఎక్కువ ఉన్నవారు అర్హులన్నారు.

May 30, 2026 / 04:26 PM IST

‘అభ్యాసకులను నమోదు చేయించాలి’

BPT: అద్దంకిలోని మెప్మా కార్యాలయంలో శనివారం అక్షర-ఆంధ్ర ఉల్లాస్ పథకం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్‌పీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అక్షర-ఆంధ్ర కన్వీనర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అభ్యాసకుల నమోదు చేపట్టిందన్నారు.

May 30, 2026 / 04:21 PM IST

పాతపట్నంలో CMRF చెక్కు అందజేత

SKLM: పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురంకి చెందిన కే. సరస్వతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆమె సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చెయ్యగా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 3 లక్షలు చెక్కును స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం తన కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.

May 30, 2026 / 04:21 PM IST

అధికారులపై ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఫైర్

ASR: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి శనివారం రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటలైనా సంబంధిత అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

May 30, 2026 / 04:21 PM IST

మడకశిరలో బైక్‌ దొంగలు అరెస్ట్

సత్యసాయి: మడకశిర ప్రాంతంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. ప్రత్యేక నిఘా, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

May 30, 2026 / 04:20 PM IST

శ్రీవారిని దర్శించుకున్న బొల్లినేని

NLR: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటివార్‌తో  కలిసి శనివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

May 30, 2026 / 04:20 PM IST