• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రూ. 20 లక్షల మోసం.. కేసు నమోదు

AKP: రాజకోడూరుకు చెందిన వ్యక్తి వద్ద రూ.20 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశ్‌నగర్‌కు చెందిన కర్రి వెంకటరమణ వద్ద బైలపూడి సన్యాసిరావు, వెంకటరమణ, గణేష్ డబ్బు తీసుకుని వడ్డీతో చెల్లిస్తామని చెప్పి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

April 12, 2026 / 09:28 AM IST

బొబ్బిలి డీఎస్పీగా గోవిందరావు

VZM: రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. అందులో భాగంగా విజయనగరం టౌన్ ఇంచార్జ్ డీఎస్పీ, దిశా డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్.గోవిందరావును బొబ్బిలి డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు అదే స్థానంలో విధులు నిర్వహించిన భవ్యారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో చీపురుపల్లి డీఎస్పీగా పనిచేస్తున్న రాఘవులును బొబ్బిలి ఇంచార్జ్ డీఎస్పీగా వ్యవహరించారు.

April 12, 2026 / 09:26 AM IST

రేపు జాల్లాలో PGRS: కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ డా. ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.

April 12, 2026 / 09:23 AM IST

కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తులసి దళార్చన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముగ్గురు ఉభయ దాతలు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​పూజ అనంతరం ఆలయ అర్చకులు దాతలకు తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.

April 12, 2026 / 09:17 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండల టీడీపీ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ.34 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న అందజేశాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 12, 2026 / 09:12 AM IST

సింగరాయకొండలో చోరీ.. బంగారం, నగదు చోరీ

ప్రకాశం: సింగరాయకొండలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. లలితమ్మకు చెందిన ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లిన బాధితురాలు ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.

April 12, 2026 / 09:10 AM IST

జిల్లా రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

ఎన్టీఆర్: విశాఖపట్నం-లోకమాన్య(నం.18519/20) తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్‌ప్రెస్ రైళ్లను నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ సమయంలో ఖాజీపేట జంక్షన్‌లో స్టాప్‌ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

April 12, 2026 / 09:07 AM IST

నేడు బద్వేలులో కంటి వైద్య శిబిరం

KDP: బద్వేలు పురపాలికలోని నెల్లూరు రోడ్డులో రాచ పూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హిస్తున్నట్లు కళాశాల ఏవో సాయికృష్ణ తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య శస్త్ర చికిత్సలు నిర్వహణ, మందులు, అద్దాల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 12, 2026 / 09:06 AM IST

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

TPT: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ తెలిపారు. జీవకోన ప్రాంతంలోని రాఘవేంద్ర నగర్ కూడలి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ చిన్నంగారి షణ్ముగం(49)ను అరెస్టు చేసి అతని బ్యాగ్‌లో ఉన్న నాలుగు కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.

April 12, 2026 / 09:04 AM IST

మామిడి రైతులకు గమనిక

CTR: తవణంపల్లి మండలంలో టోకెన్లు పొందిన మామిడి రైతులకు ఇవాళ, రేపు ఉదయం 10 గంటలకు దిగువమాఘం సొసైటీ భవనం వద్ద కవర్లు పంపిణీ చేయనున్నారు. రైతులు తమకు కేటాయించిన తేదీల్లోనే రావాలని అధికారులు కోరారు. కవర్లు లూజ్‌గా ఉండే అవకాశం ఉన్నందున సంచులు తీసుకు రావాలని హార్టికల్చర్ అధికారిణి సాగరిక సూచించారు.

April 12, 2026 / 09:04 AM IST

నేడు జిల్లాలో మాంసం ధరలు ఇలా..

ATP: జిల్లాలో ఇవాళ చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.190, స్కిన్ లెస్ రూ.210, అనంతపురంలో రూ.200, స్కిన్ లెస్ రూ.220 గుంతకల్లులో రూ.200, స్కిన్లెస్ రూ.220 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీ పై రూ. 20 నుంచి 30 ధరలు తగ్గాయన్నారు.

April 12, 2026 / 09:00 AM IST

నగరంలోని 16 ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు: కమిషనర్

KKD: మండిపోతున్న ఎండలవేళ ప్రజలకు ఊరటనిచ్చేందుకు నగరంలోని 16 ప్రధాన కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇవాల్టి నుంచి అన్ని చలివేంద్రాలు పని చేస్తాయన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

April 12, 2026 / 09:00 AM IST

పుట్టపర్తి మున్సిపాలిటీలో ‘ఫోన్‌ ఇన్’ కార్యక్రమం

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవాళ ‘ఫోన్‌ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కమిషనర్‌ నేరుగా అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. ప్రజలు 9515133115, 8639060229 నెంబర్లకు ఫోన్‌ చేసి తమ ఫిర్యాదులు, సూచనలు తెలపవచ్చని పేర్కొన్నారు. 

April 12, 2026 / 09:00 AM IST

సీతానగరంలో విజయవంతంగా జనగణన తొలి విడత శిక్షణ

E.G: సీతానగరం మండలంలో జనగణన (Census) తొలి విడత శిక్షణ కార్యక్రమం శనివారంతో విజయవంతంగా ముగిసింది. తహసీల్దార్ (ఎంఆర్డీ) శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గణన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నమోదు ప్రక్రియపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

April 12, 2026 / 09:00 AM IST

“జింక్ ఫుడ్‌తో అనారోగ్యం”

AKP: జింక్ ఫుడ్ తీసుకుంటే అనారోగ్యానికి గురవుతారని ఎలమంచిలి ఐసీడీఎస్ సీడీపీఓ ఇంద్రాదేవి అన్నారు. మునగపాక అంగన్వాడి కేంద్రాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఆకుకూరలతో తయారుచేసిన ఆహారం, వివిధ రకాల పండ్లు పిల్లలకు ఇవ్వాలన్నారు. ఆటపాటలతో పిల్లలకు విద్యాబోధన చేయాలన్నారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఆట బొమ్మలు తయారు చేయాలన్నారు.

April 12, 2026 / 08:56 AM IST