• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పంగులూరులో జనగణన శిక్షణ తరగతులు ప్రారంభం

బాపట్ల: పంగులూరు మండల కేంద్రంలోని APM వెలుగు కార్యాలయ మీటింగ్ హాల్‌లో జనగణన-2027 (Census 2027) శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయిలో డేటా సేకరణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని, అన్నారు.

April 9, 2026 / 12:09 PM IST

ఎస్పీలుగా పలువురి పేర్లు పరిశీలన

గుంటూరు: జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

April 9, 2026 / 12:04 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ‘ప్రజా దర్బార్‌’

E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ‘ప్రజా దర్బార్‌’ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదుల స్వీకరించారు. సమస్యను సంబంధిత అధికారికి బదిలీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

April 9, 2026 / 12:00 PM IST

సారా కేసులో నలుగురు అరెస్ట్

ASR: నాటు సారా కేసుల్లో నలుగురు పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో పాత కేసులకు సంబంధించి వీరిని పట్టుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నాటు సారా వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 9, 2026 / 11:59 AM IST

మత్స్యకారులతో చర్చించనున్న కలెక్టర్

NLR: దక్షిణ తీర ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారులుతో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. నెల్లూరు టౌన్ హాల్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పలు అంశాలపై చర్చించనున్నారు. మత్స్యకారుల రక్షణతో పాటు సముద్ర తీరాల భద్రతపై కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడనున్నారు.

April 9, 2026 / 11:52 AM IST

వేదాంత కంపెనీ ఎదుట నిరుద్యోగుల నిరసన

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద వేదాంత ఆయిల్ కంపెనీ ఎదుట నిరుద్యోగ యువత బుధవారం రాత్రి రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం దిగి రాకపోతే మూడవ రోజు కూడా కంపెనీ కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

April 9, 2026 / 11:52 AM IST

రూటు మారిన ఆర్టీసీ బస్సు

CTR: మరమ్మతుల్లో భాగంగా పీలేరులోని ఎల్బీఎస్ రోడ్డులో రైల్వే గేట్ మూసివేశారు. ఈ నేపథ్యంలో సదుం నుంచి పీలేరుకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్ రూట్ మార్చారు. రైల్వే స్టేషన్, డిగ్రీ కాలేజ్, మదనపల్లె జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

April 9, 2026 / 11:42 AM IST

గ్రామ కమిటీల పరిచయ వేదికలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో గ్రామ కమిటీల పరిచయ వేదిక కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గురువారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తుచేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలని సూచించారు.

April 9, 2026 / 11:40 AM IST

పాడి రైతులకు భారంగా పశు పోషణ

CTR: జిల్లాలో పాడి రైతులకు పశు పోషణ భారంగా మారింది. గతంలో పొలాల వద్ద పచ్చిగడ్డి విరివిగా లభించేది. ప్రస్తుతం వేసవి కావడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. లభ్యత లేకపోవడంతో వరిగడ్డిని ఇతర జిల్లాల నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్ వరి గడ్డి రూ. 20 వేలు పలుకుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.

April 9, 2026 / 11:35 AM IST

ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళలే

KRNL: మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని UTF మండల ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కోసిగి మం. జంపాపురం, సజ్జలగూడెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళలే ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు.

April 9, 2026 / 11:30 AM IST

ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంగారావు

కోనసీమ: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎం.రంగారావు ఎన్నికయ్యారు. అమలాపురంలో గురువారం జరిగిన జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో రంగారావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వై.సాయి వెంకట రమణారావు, ఉపాధ్యక్షులుగా నరేంద్ర కుమార్, కార్యదర్శిగా రాయుడు సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా టి.మమత బాధ్యతలు స్వీకరించారు.

April 9, 2026 / 11:26 AM IST

ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానం

ATP: కనేకల్ మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రెహనా బేగం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయని టెన్త్ పాస్ అయిన విద్యార్థిని, విద్యార్థులు ఈ నెల 30 తేదీల్లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

April 9, 2026 / 11:22 AM IST

స్వాతంత్య్ర సమరయోధుడికి చివరి వీడ్కోలు

సత్యసాయి: మడకశిర మండలం మెలవాయి గ్రామంలో స్వాతంత్య్ర సమర యోధులు గోవింద రెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. అంత్యక్రియలు మడకశిర RDO ఆనంద్ కుమార్, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, RI సోమశేఖర్ రెడ్డి, VRO అనిత, మడకశిర CI సుబ్రహ్మణ్యం తదితర సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

April 9, 2026 / 11:18 AM IST

తిరుమల శ్రీవారి సేవలో నయనతార

TPT: ప్రముఖ సినీ నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు తిరుమల శ్రీవారిని ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు.

April 9, 2026 / 11:11 AM IST

మే 12 నుంచి చిత్తూరు గంగమ్మ జాతర

CTR: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మే 12, 13వ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జాతర వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు. మే 5న గంగమ్మ జాతర చాటింపు, 12న జాతర తొలి పూజలు చేస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం మహా కుంభ నైవేద్యం సమర్పిస్తామన్నారు. 13న నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.

April 9, 2026 / 11:10 AM IST