• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శాంతియుతంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

E.G: ధర్మవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి మంగళవారం సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా బాబా సాహెబ్ ఆశయాలను పాటించాలన్నారు. పిల్లలకు అంబేడ్కర్ సిద్ధాంతాలపై పరీక్షలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని గ్రామస్థులకు తెలిపారు. ఆయన గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు.

April 8, 2026 / 09:42 AM IST

నూతన తహసీల్దార్ కార్యాలయానికి వినతి

సత్యసాయి: పెనుకొండలో కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రెవెన్యూ సేవల సంఘం ప్రతినిధులు మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత భవన పరిస్థితులను వివరించిన రెవెన్యూ సిబ్బంది, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నూతన భవనం నిర్మించాలని కోరారు.

April 8, 2026 / 09:38 AM IST

‘జీవో నంబర్ 60 రద్దు చేయాలి’

PPM: పంచాయతీ అభివృద్ధి అధికారుల వేతన సవరణపై వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. వేతనాలు తగ్గించబడిన నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు వీరఘట్టం, గరుగుబిల్లి, భామిని మండలాల్లో మంగళవారం ఎంపీడీవోలను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. సంబంధిత జీవో నంబర్ 60ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

April 8, 2026 / 09:37 AM IST

వీరబల్లిలో చమర్తి జగన్ మోహన్ రాజు పర్యటన

అన్నమయ్య: వీరబల్లి మండలంలో బుధవారం రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పర్యటించనున్నారు. సంఘం వాళ్ళ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రందెవాండ్లపల్లి, పిచ్చిగుంటపల్లి గ్రామాల్లో ఉదయం 10 గంటలకు పలు త్రాగునీటి బోర్ల భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి.

April 8, 2026 / 09:35 AM IST

అకాల వర్షం.. నేలకొరిగిన వరిచేలు

కోనసీమ:కె.గంగవరం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దాళ్వా, వరిచేలు నేలకొరిగాయి. కోతలు ప్రారంభమయ్యే తరుణంలో ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నేలపాలవ్వడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

April 8, 2026 / 09:21 AM IST

డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం

KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా, కార్మికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

April 8, 2026 / 09:15 AM IST

జిల్లా వ్యాప్తంగా 267 కేసులు

KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 267 కేసులు నమోదు చేసి రూ.57,900 జరిమానాలు విధించారు. పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

April 8, 2026 / 09:13 AM IST

రేషన్ షాపుల్లో కందిపప్పు కరవు

W.G: జిల్లాలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో రూ.67లకే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.140 కి పైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోటా ప్రకారం కందిపప్పును సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

April 8, 2026 / 09:13 AM IST

‘గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి’

VZM: గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను పట్టణ సీఐ కె.నారాయణరావు ఆదేశించారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామాలలో గంజాయి నివారణ ప్రతి కదలికను గమనించలన్నారు. సైబర్ నేరాలు బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. శక్తి యాప్‌ను ఇంస్టాల్ చేపించాలని కోరారు.

April 8, 2026 / 09:07 AM IST

‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీంను విజయవంతం చేయాలి’

నెల్లూరు డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీంను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ లేఅవుట్లు, అనధికారిక భూములను చట్టబద్ధం చేయడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు, కావలి మున్సిపల్ కమిషనర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు.

April 8, 2026 / 09:06 AM IST

‘ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలి’

GNTR: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలో మంత్రుల ఉప సంఘం సమావేశం జరిగింది. కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 787 కంపెనీలను కూడా ట్రాక్ చేస్తామని పేర్కొన్నారు.

April 8, 2026 / 09:05 AM IST

‘జీవో నెంబర్60ని రద్దు చేయాలి’

ASR: జీవో నెంబర్ 60 రద్దు చేయాలని కొయ్యూరు మండలంలోని అన్ని పంచాయతీల అభివృద్ధి అధికారులు కోరారు. మంగళవారం పంచాయతీ అభివృద్ధి అధికారుల సమాఖ్య మండల యూనియన్ తరపున ఎంపీడీవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్-60 వల్ల రాష్ట్రంలో సుమారు 6,166 మంది పీడీవోలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జీతం స్కేల్ రూ.28,280 నుంచి రూ.25,220 కి మార్పు చేయడం తగదన్నారు. 

April 8, 2026 / 09:04 AM IST

మీడియా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే

SKLM: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు. ధర్నాల పేరు తో వైసీపీ నేతలు గూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు పేర్కొన్నారు.

April 8, 2026 / 09:03 AM IST

ద్వారకాతిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

ELR: కూటమి ప్రభుత్వం మంగళవారం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ బోర్డులో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 13 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారికి స్థానం కల్పించారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు, BJPకు చెందిన ఒకరిని కూడా ట్రస్ట్ బోర్డులో చేర్చారు.

April 8, 2026 / 08:59 AM IST

గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి: శ్రీవాస్

GNTR: తాడేపల్లి బాలాజీ గ్యాస్ ఏజెన్సీని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ మంగళవారం తనిఖీ చేశారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ ముందుగా బుక్ చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సిలిండర్లను గోడౌన్ వద్ద కాకుండా నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయాలని ఆమె ఆదేశించారు.

April 8, 2026 / 08:57 AM IST