• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భీమవరంలో ఉపాధ్యాయుల ధర్నా

W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయం సమీపంలో PRTU ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి CPSను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ఇవ్వాలనీ కోరారు.

April 21, 2026 / 04:37 PM IST

ఈనెల 21న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమం

ELR: దేశవ్యాప్తంగా కార్మికులు ఈనెల 21న ‘డిమాండ్స్ డే’గా పాటించాలని ఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు ఇచ్చిందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.వి.రమణ అన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ టింబర్ డిపో వద్ద డిమాండ్స్ డే పాటించారు. నోయిడాలో కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులను నిలుపుదల చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు.

April 21, 2026 / 04:34 PM IST

అర్జీలను సత్వరమే పరిష్కరించండి: RDO

KDP: PGRS కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కారం చేయాలని కడప ఆర్టీవో మురళి తెలిపారు. ఇవాళ సిద్ధవటం MRO కార్యాలయాన్ని RDO తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రెవెన్యూ డికెటి పొలాలను ఆక్రమితకు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమితకు గురైన ప్రదేశాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని MROకు సూచించారు.

April 21, 2026 / 04:33 PM IST

TDP కార్యకర్త ఆతుకూరి రామకృష్ణకు పరామర్శ

PLD: నరసరావుపేట పట్టణం 30వ వార్డు ఆర్యవైశ్యుల TDP సీనియర్ కార్యకర్త ఆతుకూరి రామకృష్ణ‌ను 30వ వార్డు ఇంఛార్జ్ యూనిస్, 29వ వార్డు సెక్రటరీ బచ్చే మస్తాన్, 29వ వార్డు వైస్ ప్రెసిడెంట్ ముజీర్ పరామర్శించారు. కోట సెంటర్‌లోని లిఖిత హాస్పిటల్‌లో ప్రమాదవశాత్తు పడి కుడి బుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు.

April 21, 2026 / 04:23 PM IST

ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి బీజేపీ ఇంటింటి ప్రచారం

E.G: రాజమండ్రి 16వ వార్డు తుమ్మగంట మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు వీధుల్లో ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా పాల్గొన్నారు.

April 21, 2026 / 04:20 PM IST

’18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోండి’

ATP: రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో నియోజకవర్గ ఎలక్ట్రోల్ అధికారి రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 18 ఏళ్ల నిండిన యువతి యువకులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు.

April 21, 2026 / 04:20 PM IST

పెనుకొండలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరసన

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని శ్రీ సత్యసాయి కళాశాలలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మంగళవారం నిరసన చేపట్టారు. మహిళా మోర్చా నాయకురాలు సుభద్రమ్మ ఆధ్వర్యంలో విద్యార్థినులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్ప మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ కోసం సాగిన దశాబ్దాల పోరాటాన్ని ప్రతిపక్షం అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.

April 21, 2026 / 04:20 PM IST

‘పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి’

SKLM: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. సాంకేతికతను జోడించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

April 21, 2026 / 04:19 PM IST

‘మీ పిల్లలపై నిఘా పెట్టండి’

ప్రకాశం: ఈతకు వెళ్లకుండా మీ పిల్లలపై నిఘ ఉంచాలని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో మీ పిల్లలు మీ ప్రాంతాలలో ఉన్న బావులు, చెరువులు, వాగులు, ఉపాధి హామీ పథకంలో తవ్విన గుంటలలోకి ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. గతంలో చిన్నారులు మృతి చెందిన సంఘటనలను గుర్తు చేస్తూ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

April 21, 2026 / 04:17 PM IST

నరసింహస్వామిని దర్శించుకున్న చినజీయర్ స్వామి

సీతానగరం సువర్ణముఖి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంగళవారం చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు స్వామి వారి కండువా వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ స్వామి వారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారన్నారు.

April 21, 2026 / 04:14 PM IST

పోషణ పక్వాడ కార్యక్రమం

AKP: నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం 8వ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలకు సెల్ పోన్లు ఇవ్వడం ద్వారా కంటి చూపు సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే మెదడు అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు. బయట దొరికే ఆహారం కాకుండా ఇంట్లోనే దొరికే పౌష్టికాహారంను తయారు చేసి పెట్టాలన్నారు.

April 21, 2026 / 04:11 PM IST

యుద్ధం పేరిట దోపిడీ.. సామాన్యుడిపై డబుల్ దెబ్బ

GNTR: యుద్ధ వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచుతున్నారనే విమర్శలు నగరంలో వెల్లువెత్తుతున్నాయి. ఎండల తీవ్రతతో పాటు ధరల భారంతో ప్రజలు నలిగిపోతున్నారు. ఇడ్లీలు నుంచి కూరగాయలు, గ్యాస్ వరకు 5-15% పెరుగుదల ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి జోక్యం చేసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

April 21, 2026 / 04:10 PM IST

72 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ

BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం జడ్పీ హైస్కూల్‌లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 72 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల కోరిక మేరకు వెంటనే డైనింగ్ హాలును మంజూరు చేసిన మంత్రి.. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే మంత్రి లోకేష్ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

April 21, 2026 / 04:08 PM IST

విషాదం.. ఉపాధి హామీ కూలీ మృతి

VZM: గంట్యాడ మండలంలోని కొత్త వెలగాడలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనికి వెళ్లిన కన్నయ్య (65) అనే వ్యక్తి మంగళవారం పని చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి కూలీలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ఎంపీడీవో రమణమూర్తి తెలిపారు. పని స్థలంలోనే మరణించినందున ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా సిఫార్సు చేశామని పేర్కొన్నారు.

April 21, 2026 / 04:06 PM IST

విద్యార్థులకు ‘డ్రై ఐ సిండ్రోమ్’పై అవగాహన సదస్సు

W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు ‘డ్రై ఐ సిండ్రోమ్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ.. కళ్లలో మంట, దురద, ఎరుపు ఎక్కడం, దృష్టి మసకబారడం వంటివి వ్యాధి లక్షణాలని, వీటి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువతకు కంటి సమస్యలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 21, 2026 / 04:02 PM IST