• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారనికి జేసీకి వినతి

NTR: విజయవాడలో జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆందోళన జరిగింది. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు రైతులతో కలిసి పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించారు. గిట్టుబాటు ధర కల్పించి, నందిగామ డీస్టీలరీలు రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

April 6, 2026 / 02:35 PM IST

అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎమ్మెల్యే

ATP: యాడికి పర్యటనకు విచ్చేసిన CM చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో కలిసి ఆమె ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి జై బాబు నినాదాలతో హోరెత్తించారు.

April 6, 2026 / 02:30 PM IST

రోడ్ల నాణ్యతపై రాజీ ఉండకూడదు: కమిషనర్

E.G: రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండకూడదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. ఆదర్శ్ నగర్, మహాలక్ష్మి టెంపుల్ పార్క్ వద్ద ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులను ఇవాళ పరిశీలించారు. పూర్తి చేసిన రహదారుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

April 6, 2026 / 02:30 PM IST

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

CTR: చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మంత్రి వివరించారు. పురపాలక పన్నుల వసూళ్లపై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 02:30 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1.10 కోట్లతో కట్టవాని చెరువు–తాడిచర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాడి రైతులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 6, 2026 / 02:29 PM IST

‘నీటి సంరక్షణలో సాగునీటి సంఘాల బాధ్యత కీలకం’

VSP: నీటి భద్రతలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. పెందుర్తి మండలం సరిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో కాలువల పూడికతీత, నీటి వృథా నివారణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

April 6, 2026 / 02:14 PM IST

‘నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత’

AKP: నీటి భద్రతకు సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలని పాయకరావుపేట మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ విజ్ఞప్తి చేశారు. సోమవారం శ్రీరాంపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలన్నారు. అలాగే, గేట్ల ఆధునీకరణ, పంట కాలువల మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

April 6, 2026 / 02:13 PM IST

‘వినతులను పరిశీలించి పరిష్కరిస్తాం’

PPM: ప్రజా దర్బార్ లో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన పలు వినతులను ఆయన స్వీకరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.

April 6, 2026 / 02:12 PM IST

‘నిర్దేశిత మెనూను అందజేయాలి’

SKLM: నిర్దేశిత మెనూను అందజేయాలని ఐఐఐటీ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం డైరెక్టర్ ఐఐఐటీ మెస్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం తయారుచేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు అందజేసిన ఆహారంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 02:12 PM IST

9న సర్వసభ్య సమావేశం

VZM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 9న (గురువారం) ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరగనుంది. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.వి.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

April 6, 2026 / 02:11 PM IST

కల్లుకుంటలో తాగునీటి కష్టాలు..!

KRNL: పెద్దకడబురు (మం) కల్లుకుంటలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని CPM మండల కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు. ఇవాళ MPDO ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. 6000 వేల జనాభా కలిగిన గ్రామంలో 15 రోజులకు ఒకసారి తాగునీరు వదులుతున్నారని వాపోయారు. మూడు ఓవర్ హెడ్ ట్యాంకులకు ఒకే పైపులైన్ ఉండడం వల్ల తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుందని పేర్కొన్నారు.

April 6, 2026 / 02:08 PM IST

శ్రీ వీర అభయాంజనేయ స్వామి ప్రతిష్టకు భూమి పూజ

శ్రీకాకుళంలో శ్రీవీర అభయాంజనేయ స్వామి విగ్రహ స్థాపనకు భూమి పూజ సోమవారం ఘనంగా నిర్వహించారు. తోటపాలెం జంక్షన్ సమీపంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనంద్ రావు భూమి పూజ అనంతరం మాట్లాడుతూ.. దాతల సహకారం అవసరమని పేర్కొన్నారు.

April 6, 2026 / 02:04 PM IST

నదిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

KDP: వల్లూరు(మం) పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కడపకు చెందిన హర్షవర్ధన్ (22), హరిబాబు (25) మృతదేహాలు ఆదివారమే వెలికితీశారు. అయితే, ఐటీ సర్కిల్ వాసి కృష్ణ చైతన్య (20) కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి సోమవారం ఉదయం చైతన్య మృతదేహాన్ని నదిలో నుంచి బయటికి తీశారు.

April 6, 2026 / 02:03 PM IST

డ్రగ్స్‌పై “దండి మార్చ్ 2.0” అవగాహన కార్యక్రమం

TPT: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “దండి మార్చ్ 2.0” పేరుతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, సూళ్లూరుపేట పరిధిలోని పాఠశాలలు, కళాశాలల నుంచి 7 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

April 6, 2026 / 02:02 PM IST

ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తమ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.

April 6, 2026 / 02:00 PM IST