• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పినాక ఉచిత శిక్షణతో విద్యార్థులకు సువర్ణావకాశం’

KRNL: ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల సాధనకు పినాక ప్రజా సాధికార ట్రస్ట్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ఇవాళ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో 21 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

May 31, 2026 / 10:13 PM IST

మార్కాపురం జిల్లా PGRS వేళల్లో మార్పులు

ప్రకాశం: మార్కాపురం జిల్లాలో జూన్ 1న నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని కోరారు. కాగా ఇటీవల ఎండల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే నిర్వహించిన విషయం తెలిసిందే.

May 31, 2026 / 10:04 PM IST

రేపు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పర్యటన వివరాలు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8 గంటలకు గుమ్మిలేరు గ్రామంలో ఎంపీ గంటి హరీష్ మధుర్‌తో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు వాడపల్లి దేవస్థానం వద్ద కెనరా బ్యాంక్ వారు ఆలయానికి అందజేసిన నూతన బస్సును ప్రారంభిస్తారు.

May 31, 2026 / 10:00 PM IST

హిందూపురంలో పాలియేటివ్ కేర్ సేవలు ప్రారంభం

SS: హిందూపురంలో సత్యసాయి పాలియేటివ్ హోమ్ కేర్ సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. సత్యసాయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సాయిసదన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ, లివర్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇంటి వద్దే ఉచిత సేవలు అందించనున్నారు. అవసరమైన వారికి వైద్య సహాయం అందించడమే ఈ సేవల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

May 31, 2026 / 10:00 PM IST

కిడ్నీ వ్యాధి బాధపడుతుడికి ఆర్థిక సహాయం అందజేత

E.G: రాజమండ్రి రూరల్ మున్సిపల్ డివిజన్ 18 వ వార్డ్ కు చెందిన మoగా నగేశ్ 28 సంవత్సరాల యువకుడుగత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా గోరంట్ల రవిరామ్ కిరణ్ GSR ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. నగేశ్ వైద్య చికిత్సకు తోడ్పాటుగా సహాయాన్ని అందజేశారు.

May 31, 2026 / 10:00 PM IST

రాయదుర్గం ఎంఈవో-2 సేవలను అభినందించిన ఎమ్మెల్యే

రాయదుర్గం మండలం ఎంఈవో-2గా బాధ్యతలు నిర్వహించి గొప్ప పేరు సంపాదించారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు కొనియాడారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు ఎంఈవో-2 పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.

May 31, 2026 / 10:00 PM IST

సంపూర్ణ కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహిస్తాం: ఎమ్మెల్యే

EG: 2027 గోదావరి పుష్కరాలు సంపూర్ణ కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ రహితంగా, అత్యంత ఆధ్యాత్మిక శోభతో నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. భావితరాల భవిష్యత్తుకు కాలుష్య రహిత సమాజాన్ని అందించే భాద్యత ప్రభుత్వం తీసుకుందన్నారు.

May 31, 2026 / 09:30 PM IST

రైతులను అడ్డుపెట్టి సోమిరెడ్డి దోపిడీ: కాకాణి

NLR: పొదలకూరు మండలం నావూరు చెరువు కట్టను ఆదివారం పరిశీలించిన వైసీపీ నేత కాకాణి ఇరిగేషన్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల పేరిట సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పనుల్లో అవినీతి, దొంగ బిల్లులపై సోమిరెడ్డితో నావూరు చెరువు కట్టపైనే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

May 31, 2026 / 09:30 PM IST

భీమునిచెరువులో ఎల్లమ్మ తిరునాళ్లు వైభవం

TPT: నారాయణవనం మండలం భీమునిచెరువులో జరుగుతున్న ఎల్లమ్మ తిరునాళ్లలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండం ప్రవేశం చేయగా, కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా సాగింది.

May 31, 2026 / 09:24 PM IST

చర్చిలో దొంగతనం.. కేసు నమోదు

VZM: ఎస్.కోట అరకు ప్రధాన రహదారి ఆర్. కె. ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న హెబ్రాన్ చర్చిలో దొంగతనం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ నారాయణ మూర్తి వివరాల ప్రకారం.. ఈనెల 24న ప్రార్థనల ఆనంతరం తలుపులు వేసి వెళ్ళిపోయారు. ఆదివారం వచ్చి చూడగా కొన్ని విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిపోయినట్లు చెప్పారు. కె.అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

May 31, 2026 / 09:20 PM IST

‘రేపు జరిగే వైసీపీ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలి’

కోనసీమ: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమలాపురం వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ తెలిపారు. నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.

May 31, 2026 / 09:17 PM IST

బూత్ స్థాయి బలోపేతంపై వైసీపీ దృష్టి

TPT: శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్షా సమావేశం, ఎస్‌ఐఆర్‌ శిక్షణ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీ విజయానికి కీలకమని పేర్కొంటూ.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

May 31, 2026 / 09:17 PM IST

వాహన తనిఖీలు చేసిన పోలీసులు

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఆదివారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ ధరించనవారికి, వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. తనిఖీల సమయంలో సిబ్బందికి సహకరించాలని కోరారు.

May 31, 2026 / 09:03 PM IST

నగరంలో వినూత్న వినోద.. పర్యాటక కేంద్రం

E.G: రాజమండ్రి 1వ డివిజన్ సమీపంలోని కార్పొరేషన్ స్థలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఆర్ ప్లే’ ప్రాజెక్టుకు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. తొలి దశలో రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు ఆరు నెలల్లో పూర్తిచేస్తామని కాంట్రాక్టర్ సంస్థ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నగర ప్రజలకు వినోదంతో పాటు పర్యాటక ఆకర్షణలను అందిస్తామన్నారు.

May 31, 2026 / 09:00 PM IST

మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి సన్మానం

SS: జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపికైన పోలేపల్లి ప్రశాంత్ కుమార్ ఆదివారం పల్లె క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. నూతనంగా ఎన్నికైన ప్రశాంత్ కుమార్ తోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజీ మంత్రిని గజమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోలేపల్లి ప్రశాంత్‌ను పల్లె అభినందించారు.

May 31, 2026 / 09:00 PM IST