• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కన్యకా పరమేశ్వరి ఆలయ ఎన్నికలు వాయిదా

GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ నెల 26న కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా నామినేషన్‌ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, కమిటీ సభ్యుడు గుండా పిచ్చయ్య కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు తాత్కాలికంగా నిలిపి వేయాల్సిందిగా 11వ అదనపు జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చినట్లు ఎన్నికల అధికారి సాధువు ప్రతాప్ తెలిపారు.

April 4, 2026 / 02:11 PM IST

పాలకొల్లులో వైసీపీ నేతల ఆందోళన

W.G: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం పాలకొల్లులో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గాంధీబొమ్మల సెంటర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొలుత పూజలు నిర్వహించిన అనంతరం నిరసన తెలిపారు. వివాదాస్పదంగా మారిన నాయుడును వెంటనే సస్పెండ్ చేసి, టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు.

April 4, 2026 / 02:05 PM IST

పారిశుధ్య పనులపై కమిషనర్ సమీక్ష

కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 1వ డివిజన్‌లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సిబ్బంది హాజరు పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలుపై కూడా సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

April 4, 2026 / 02:05 PM IST

‘దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి’

అన్నమయ్య: హసనాపురం గ్రామంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, దేవుళ్లను రాజకీయాలకు లాగొద్దని వారు అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీఎం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

April 4, 2026 / 02:05 PM IST

చేబ్రోలులో CMRF చెక్కులు పంపిణీ

GNTR: చేబ్రోలు మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. లబ్ధిదారలకు మొత్తం రూ.3,98,802లను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్సలకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

April 4, 2026 / 01:54 PM IST

‘బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలి’

NDL: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం డిమాండ్ చేశారు. బనగానపల్లెలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం మాట్లాడుతూ.. మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 01:45 PM IST

కస్తూర్బా విద్యాలయంలో ప్రవేశాల గడువు పొడిగింపు

KRNL: హలహర్వి KGBVలో ఆరవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద కుటుంబాల విద్యార్థినులు ఈ అవకాశానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 4, 2026 / 01:44 PM IST

సీపీఐ జిల్లా నూతన కార్యదర్శి ఆర్. వెంకట్రావు

ప్రకాశం జిల్లా సీపీఐ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. వెంకట్రావును శనివారం ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి, ఎ. సురేష్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

April 4, 2026 / 01:41 PM IST

‘చేనేతల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది’

KDP: చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజంపేట TDP ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు తెలిపారు. శనివారం మాధవరం-1 సచివాలయంలో చేనేతలకు ఉచిత విద్యుత్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు చమర్తి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లను కూటమి ప్రభుత్వం అందించడం హర్షనీయమన్నారు.

April 4, 2026 / 01:40 PM IST

అన్న ప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం

TPT: అనంతపురానికి చెందిన వీఎస్ రవి కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంగా డీడీని అందజేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతను, కుటుంబ సభ్యులను అభినందించారు.

April 4, 2026 / 01:37 PM IST

చేబ్రోలులో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

GNTR: చేబ్రోలులోని బొమ్మలగుడి వద్ద శనివారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అక్కడి రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ సీతారాముల పటాన్ని, అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

April 4, 2026 / 01:36 PM IST

‘టీటీడీ ఛైర్మన్‌పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు’

PLD: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా అమరావతి మండలం వైకుంఠపురంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 4, 2026 / 01:32 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలి: వైసీపీ

పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ శ్రేణులు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను పాడుచేస్తున్నారని ఆరోపిస్తూ ఐటీడీఏ పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 4, 2026 / 01:31 PM IST

విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం

ATP: గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ స్తంభాన్ని సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ సమయంలో ఈ రోడ్డు మార్గాన జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

April 4, 2026 / 01:30 PM IST

కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన కమిషనర్

NLR: నగర కమిషనర్ వై.ఓ నందన్ శనివారం నగరంలోని 37వ డివిజన్ క్రాంతి నగర్‌లో పర్యటించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. నాణ్యత లోపించకుండా కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హాల్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

April 4, 2026 / 01:30 PM IST