కోనసీమ: గాడిలంక సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్పందించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటకృష్ణారావు 14 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు తేల్చిందన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన ప్రజాస్వామ్య హననానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. న్యాయపోరాటంలో విజయం సాధించిన అభ్యర్థి కృష్ణారావును, న్యాయవాది రెడ్డి సత్యనారాయణను టీడీపీ నాయకులు సన్మానించారు.
NDL: ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఇవాళ ఉండవల్లిలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 మంది విద్యార్థుల బృందంలో జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడుగురు ఉండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు.
TPT: తిరుపతి గొల్లవనిగుంటలో రూ.10.10 కోట్లతో నిర్మించిన ఆధునిక క్రీడా స్టేడియాన్ని రేపు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. CSR-PPP మోడల్లో దీనిని అభివృద్ధి చేసినట్లు శాప్ ఛైర్మన్ తెలిపారు. చంద్రగిరిలో ఇండోర్ హాల్, తిరుపతిలో బాక్సింగ్ రింగ్‌తో పాటు కరణం మల్లేశ్వరి పేరుతో అకాడమీ ఏర్పాటు చేసి జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
VZM: గజపతినగరంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక గ్రంథాలయం పక్కన నూతనంగా నిర్మించిన ‘అన్న క్యాంటీన్’ను బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఈ క్యాంటీన్ నిరుపేదలకు, బాటసారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ATP: నార్పల మండలం నడింపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ‘బనానా వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్’ను ప్రారంభించారు. అరటి వ్యర్థాల నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు, యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. పీ4, సీఎస్ఆర్ కింద సుజలన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
NTR: గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన డెంటల్ డాక్టర్ సురేష్ కృష్ణా నదిలో ఈతకు వెళ్లి మంగళవారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుంటూరులో నివాసం ఉంటున్న ఆయన ప్రతి రోజూ ఈతుకు వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘గుడ్ సమారిటన్’ పథకంతో పాటు పీఎం రాహత్ పథకం అమలు అవుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్సు తెలిపారు. కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఎం రాహత్ భరోసా పోస్టర్లను ఆవిష్కరించారు. పథకం ద్వారా గాయపడిన వారికి రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తామన్నారు.
BPT: కర్లపాలెం హైలాండ్ సెంటర్లో పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కోసం భిన్నంగా ప్రచారం చేపట్టారు. యముడు, చిత్రగుప్త వేషధారణలతో ర్యాలీ నిర్వహించి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ‘శిరో రక్ష–ప్రాణ రక్ష’ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాహనదారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ ప్రదీప్తి విశాఖపట్నం వెస్ట్ జోన్ ఏసీపీగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు బొడ్డేపల్లి సుగుణ వేణి, పేడాడ అప్పారావులు మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన యువతి ఉన్నత పదవిని అధి రోహించడం పట్ల కొర్లకోట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
W.G: కోలనపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు కోలనపల్లి గ్రామానికి, స్థానిక చెరువులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల నిర్మాణ పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలన్నారు.
KRNL: మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ పేర్కొన్నారు. ఇవాళ రాయలసీమ యూనివర్సిటీ వద్ద 54వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని PDSU నాయకులు తెలిపారు.
SS: జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఆర్ఎంపీ క్లినిక్‌లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్, వైద్యాధికారి, పోలీసులతో కూడిన బృందాలు 19 క్లినిక్‌లను పరిశీలించాయి. పెనుకొండ డివిజన్లో నిబంధనలు ఉల్లంఘించిన రెండు క్లినిక్‌లను సీజ్ చేశారు. కదిరి డివిజన్లో రెండు, పుట్టపర్తిలో ఒక క్లినిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
VSP: జీవీఎంసీ పరిధిలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో పలు అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లే విధంగా కృషిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలన్నారు.
TPT: రేపు ఉదయం 9:30 గంటలకు వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. డక్కిలి, బాలయపల్లి, వెంకటగిరి రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.