• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రజల మనసుల్లో ఎమ్మెల్యే స్థానం సంపాదించుకున్నారు’

కృష్ణా: రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కంకిపాడు టీడీపీ కిషోర్ బాబు ఈరోజు అన్నారు. సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సేవ చేయడం ఎమ్మెల్యే ప్రత్యేకత అని తెలిపారు.

April 12, 2026 / 11:28 AM IST

వాకర్స్ చార్జీలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ నిరసన

VSP: జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో వాకర్స్‌పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీల విధింపుకు వ్యతిరేకంగా ఆదివారం ఏఐవైఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి కె. అచ్యుత్ రావు మాట్లాడుతూ.. చార్జీల భారంతో వాకర్స్ సంఖ్య తగ్గిందన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులే అనుమతిస్తూ భద్రతా సిబ్బంది ప్రవేశాన్ని ఆపుతున్నారని విమర్శించారు.

April 12, 2026 / 11:21 AM IST

పీఏబీఆర్‌ కుడి కాలువకు నీటి సరఫరా బంద్‌

ATP: పీఏబీఆర్ కుడి కాలువ గేటును అధికారులు విజయవంతంగా మూసివేసి, నీటి సరఫరాను నిలిపివేశారు. 132 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేసి 48 చెరువులను నింపారు. ప్రస్తుతం జలాశయంలో 2.623 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలై వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎస్‌ఈ సుధాకర్ రావు స్పష్టం చేశారు.

April 12, 2026 / 11:20 AM IST

తెనాలి ట్రాఫిక్ పోలీసులకు సోలార్ హెల్మెట్లు అందజేత

గుంటూరు: ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేలా విశ్రాంత ప్రిన్సిపల్ నేతి చలపతి 40 సోలార్ హెల్మెట్లను అందించారు. శివాజీ చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్ వీటిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ హెల్మెట్లు ఎండ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.

April 12, 2026 / 11:20 AM IST

ఆలయంలో మాజీ కలెక్టర్ ప్రత్యేక పూజలు

ప్రకాశం: సిఎస్పురం(M) భైరవకోన దేవస్థానంలో విశ్రాంత కలెక్టర్ దాసరి శ్రీనివాసులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం కనిగిరి MLA నరసింహా రెడ్డి ఉన్నారు. గతంలో ఈ విశ్రాంత కలెక్టర్ దాసరి శ్రీనివాసులు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

April 12, 2026 / 11:16 AM IST

నిబంధనలు ఉల్లంఘించిన 25 బస్సులపై కేసులు

కోనసీమ: నిబంధనలు అతిక్రమించే ప్రైవేటు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రావులపాలెం హైవేపై నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 25 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.53,500 జరిమానా విధించినట్లు వెల్లడించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.

April 12, 2026 / 11:15 AM IST

‘రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

April 12, 2026 / 11:11 AM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులు

SKLM: రణస్థలం మండలం పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు.

April 12, 2026 / 11:10 AM IST

అన్నవరంలో రూ.1.30 కోట్లతో నూతన మెట్ల మార్గం: మంత్రి

KKD: అన్నవరం శ్రీ వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం రత్నగిరిపై టోల్ గేట్ నుంచి సెంటినరీ కాటేజ్ వరకు 1.30 కోట్ల రూపాయలతో నూతన మెట్ల మార్గం నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సత్యప్రభ వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

April 12, 2026 / 11:00 AM IST

‘దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

E.G: నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ కళాపకర్షణ, జీర్ణోద్ధారణ బలాలయ స్థాపన కార్యక్రమం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 12, 2026 / 11:00 AM IST

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డీఈవో

ATP: అనారోగ్యం నుంచి కోలుకున్న డీఈవో ప్రసాద్ బాబు ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర అస్వస్థతతో ఈనెల 8 ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉండడంతో స్టంట్ వేశారు. రెండు రోజుల పర్యవేక్షణ అనంతరం ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో వారిని కుటుంబ సభ్యులు తమ సొంతూరు కడపకు తీసుకువెళ్లారు.

April 12, 2026 / 11:00 AM IST

IIAMలో వైభవంగా ముగిసిన ‘పిన్నాకిల్-2026’

VSP: నగరంలోని ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ‘పిన్నాకిల్-2026’ మేనేజ్‌మెంట్, ఐటీ ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలో సంస్థ డీన్ డాక్టర్ ఎస్.పి. రవీంద్ర మాట్లాడుతూ, ఇటువంటి వేడుకలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

April 12, 2026 / 10:49 AM IST

వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా సుంకర లక్ష్మి

కోనసీమ: వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా అమలాపురం మండలంకి చెందిన సుంకర లక్ష్మీ కుమారి నియమితులయ్యారు. తాడేపల్లి లో ఉన్న కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు ఇవాళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, మాజీ మంత్రి విశ్వరూప్ అభినందించారు.

April 12, 2026 / 10:40 AM IST

‘జనసేన నేతపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

కోనసీమ: కాజులూరు మండలంలో వ్యాపార తగాదా విషయంలో సన్నపు లక్ష్మి అనే మహిళ పట్ల వివక్ష చూపి, దుర్భాషలాడిన జనసేన నేత అన్యం శ్రీరామచంద్రమూర్తిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. బాధితురాలు న్యాయం కోసం ఆశ్రయించగా, ఆమె కులం పేరుతో అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.

April 12, 2026 / 10:40 AM IST

అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహాల్లో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్

GNTR: అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహాల సముదాయంలో గంజాయి వినియోగం, అల్లరి మూకల కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్ సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సుమారు 800 ఫ్లాట్లు ఉన్న నాలుగు లైన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

April 12, 2026 / 10:37 AM IST