కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అంబేద్కర్ విగ్రహాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవిష్కరించి నివాళులర్పించారు. మహిళా హక్కుల కోసం అంబేద్కర్ మంత్రి పదవినే త్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని అసెంబ్లీలో కోరతానన్నారు.
కోనసీమ: రామచంద్రపురం మండలంలో మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కకర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ATP: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి MLA దగ్గుపాటి ప్రసాద్ అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను కలెక్టర్ ఎం.విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫైర్ ఎక్యూప్‌మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్.రామకృష్ణ పాల్గొన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గంలో డా.BR అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. MLA విరుపాక్షి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను విస్మరించి పాలన సాగిస్తోందని, మహిళల భద్రత తగ్గిందని విమర్శించారు.
TPT: తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మే నెలలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర ముందు మూడు వారాలు, జాతర అనంతరం ఐదు వారాలు మారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలి వారం ప్రారంభం కావడంతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
CTR: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, దళితులు, బడుగు వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శమని పేర్కొన్నారు.
PPM: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని, ఏ అనారోగ్య సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే, ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
VZM: అరకులోయలో ఇవాళ ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అలాగే, నేటి యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు.
NDL: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ కొనియాడారు. ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని అంజలి ఘటించారు.
KDP: సిద్ధవటం మండలం బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు గంగాభవాని ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యులు మాడా సుబ్బరాయుడు, రామకృష్ణలు ఇవాళ తెలిపారు. 24న అమ్మవారికి విశేష పూజలు, లక్ష కుంకుమార్చన, 25న గణపతి హోమం, 26న బోనాలు ఉంటాయన్నారు.
BPT: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఇవి కొనసాగుతాయి. మొదటి రోజు అగ్నిమాపక కేంద్రంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ కే.వినయ్ అగ్ని ప్రమాద నివారణ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం పాటు జిల్లా వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని తెలిపారు.
ELR: జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఓ దివ్యాంగుడిని పరామర్శించారు. ఆయనకు ప్రభుత్వం నుంచి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తనకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనే పథకాలను ప్రవేశపెట్టిందని ఆయనకు వివరించారు.
SKLM: భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, అణగారిన వర్గాల హక్కులను కాల రాశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.