• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఛానల్ యజమానిపై వైసీపీ నేతలు ఫిర్యాదు

ELR: వైసీపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక టీవీ ఛానల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్‌కు ఫిర్యాదు చేశారు.

April 9, 2026 / 07:42 PM IST

సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి: కలెక్టర్

మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గురువారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

April 9, 2026 / 07:40 PM IST

బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ ఆమరణ నిరాహార దీక్ష

KRNL: బీసీల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ చేపట్టిన 5 ప్రధాన డిమాండ్లకు కర్నూలు జిల్లా బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల కేటాయింపు, సమగ్ర కులగణన చేపట్టడం, చట్టసభలు, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

April 9, 2026 / 07:40 PM IST

కడపలో ఆల్లూరి వెంకటయ్య జయంతి

KDP: రంగస్థల నాటకాన్నే శ్వాసగా భావించి జీవించిన ఆల్లూరి వెంకటయ్య జీవితం ధన్యమని ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి కొనియాడారు. కడపలోని జిల్లా రచయితల సంఘం కార్యాలయంలో వెంకటయ్య 89వ జయంతి వేడుకలు నిర్వహించారు. నంది నాటకోత్సవాల్లో జిల్లాకు 28 నంది పురస్కారాలను అందించిన ఘనత వెంకటయ్యకే దక్కుతుందన్నారు. తన తర్వాత కూడా నాటక కళ బ్రతికి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

April 9, 2026 / 07:39 PM IST

డోన్ మార్కెట్ యార్డ్‌లో పశువుల రవాణాపై ఫిర్యాదు

NDL: డోన్ మార్కెట్ యార్డ్‌లో గురువారం జరిగే పశువుల సంతలో కొనుగోలు చేసిన పశువులను వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్నారని పట్టణ అధ్యక్షులు బద్రి ఫిర్యాదు చేశారు. పశువులకు ఇరుకుగా కాకుండా తగిన దాణా, నీటి సదుపాయాలతో రవాణా చేయాలని కోరారు. అలాగే ప్రతి గురు, శని వారాల్లో పశువుల అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి అందజేశారు.

April 9, 2026 / 07:38 PM IST

‘కాల్వలు, చెరువుల వివరాలను వెంటనే సమర్పించండి’

ఏలూరు జిల్లాలో నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ద్వారా చేపట్టవలసిన పనులు, కాల్వలు, చెరువుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం నాటికి నీటి వనరులన్నింటినీ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యంతో సిద్ధం చేయాలన్నారు.

April 9, 2026 / 07:33 PM IST

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌పై వివరాలు సమర్పణ

TPT: నారాయణవనం మండలంలో విద్యుత్ శాఖ ఏఈని చేనేత శాఖ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పృధ్వీరాజ్ కలిసి, చేనేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు నేపథ్యంలో వివరాలు సమర్పించారు. నారాయణవనం, పాలమంగళం ఉత్తరం, పాలమంగళం దక్షిణం, తుంబురు గ్రామాలకు చెందిన చేనేత కార్మికుల వివరాలను అందజేశారు.

April 9, 2026 / 07:32 PM IST

పాత వాహనాల కొనుగోలులో అప్రమత్తత అవసరం: ఎస్పీ

 కర్నూలు: పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఆశపడి రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని, ఆ వాహనాలను కొని ఇబ్బందులు పాలవ్వకూడదని  జిల్లా ప్రజలకు తెలిపారు.​మోటారు వాహనాల చట్టం ప్రకారం, సరైన పత్రాలు లేని వాహనాలను కలిగి ఉండటం లేదా నేరమని తెలిపారు.

April 9, 2026 / 07:25 PM IST

క్యూబాకు మద్దతుగా జోలి పట్టిన సీపీఎం

W,G: తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద క్యూబా‌కు మద్దతుగా జోలిపట్టి కార్యక్రమం గురువారం సీపీఎం నేతలు నిర్వహించారు. ఇరాన్ తర్వాత క్యూబా దేశంపై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో పాటు ఆ దేశానికి వచ్చే ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధించడం సరికాదని సీపీఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు అన్నారు.

April 9, 2026 / 07:24 PM IST

రాయచోటీలో ఎన్యూమరేటర్లకు శిక్షణ

అన్నమయ్య: రాయచోటీ మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. ట్రైనర్లు గౌస్ పీర్, ఇంతియాజ్ ఖాన్, జఫరుద్దీన్, వెంకట రమణ శిక్షణ అందించారు. రెండు బ్యాచ్‌లుగా 50 మందికి చొప్పున డేటా సేకరణ, ఫీల్డ్ మార్గదర్శకాలపై వివరించారు. ఫీల్డ్‌లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు ఇచ్చారు.

April 9, 2026 / 07:23 PM IST

టీడీపీ నాయకుని విగ్రహం ఆవిష్కరణ

PLD: నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత కడియం కోటి సుబ్బారావు విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.

April 9, 2026 / 07:20 PM IST

మైలవరం నూతన తహశీల్దార్ ఈయనే..!

KDP: మైలవరం మండల తహశీల్దార్ ఓతూరు షఫీ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ముద్దునూరు MLS పాయింట్లో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ పనులు, రీసర్వే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

April 9, 2026 / 07:14 PM IST

పట్టపగలే వెలుగులు

కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు గ్రామపంచాయతీలో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది. జనసంచారం లేని పొలాల్లో లైట్లు ఏర్పాటు చేసి, పగలు కూడా ఆఫ్ చేయకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవసరమైన వీధుల్లో మాత్రం దీపాల లేమితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సకాలంలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

April 9, 2026 / 07:11 PM IST

చీమకుర్తిలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ప్రకాశం: చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గంజాయి చాక్లెట్లు, 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 9, 2026 / 07:10 PM IST

ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన ఏవో

ASR: పట్టాదారు పాస్ పుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు ఏవో పీ.శివరామ్ ప్రసాద్ సూచించారు. కొయ్యూరు మండలం రావణాపల్లిలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు.

April 9, 2026 / 07:09 PM IST