KDP: వేంపల్లె మండల తహసీల్దార్‌గా పి. మోహన్ కృష్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరులో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన ఆయన, పదోన్నతిపై వేంపల్లెకు బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని కర్నూలు ఫ్లై ఓవర్ వద్ద మంగమ్మ కాలేజీ వైపు నుంచి మంగమూరు సిగ్నల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెనక కూర్చున్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు గాయపడిన బాలికను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికు చికిత్స కోసం తరలించారు.
GNTR: తెనాలి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధికారులకు సూచించారు. పట్టణంలోని భవనంవారి వీధి, గోలి డొంక, బోస్ రోడ్‌లోని సీతాంబ హోటల్ ఏరియాలో జరుగుతున్న అప్రోచ్ రోడ్డు, కాలువ నిర్మాణ పనులను శనివారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేవస్థానం ప్రతిష్టను దిగజారుస్తున్నారని సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆయన వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఆయనను కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు.
NTR: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ శివారులో 20 కిలోల గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయానికి సిద్ధం చేసిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీలేరు ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని అమ్మేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
కర్నూలులోని ఆర్.ఆర్. లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాల ప్రోత్సాహం కోసం కల్చరల్, ఆటల పోటీలు నిర్వహించారు. ఇవాళ ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు రవి, దాత వేదవ్యాసచార్ నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికలు, అలాగే క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
VSP: తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛైర్మన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
NDL: బనగానపల్లె మండలం జ్వాలాపురం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ టీడీపీ నాయకుడు మదన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆమె నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజలను సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఉచిత వైఫై వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దని, ఫేక్ ప్రొఫైల్‌లకు దూరంగా ఉండాలన్నారు.
ELR: ముదినేపల్లి మండలం తూర్పుపాకల ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల తుఫాన్ కారణంగా వృక్షం పాఠశాల భవనంపై పడగా పాఠశాల శిథిలావస్థకు చేరింది. వెంటనే ఉపాధ్యాయులు ఎంపీపీ సత్యనారాయణకి తెలుపగా ఆయన వెంటనే స్పందించి పాఠశాలని సందర్శించారు. ఈ క్రమంలో తాత్కాలికంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ఇవాళ ప్రారంభించారు.
E.G: మహిళలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే తొలగించాలని నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబు ఆయనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలను గౌరవించి వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన DRC మీటింగ్‌లో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల దేవాలయానికి భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు కేటాయించాలన్నారు. అలాగే R&B రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయ్యాలని కోరారు. తిరుమలంపాలెం గ్రామకంఠం 22A భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
KDP: కమలాపురం నియోజకవర్గంలో YCP పార్టీకి చెందిన గ్రామ సర్పంచుల పదవీకాలం ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, కొండాయపల్లె సర్పంచ్ పాలిటి భవాని, అడవిచెర్లపల్లె గ్రామ సర్పంచ్ నారాయణరెడ్డిలను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామానుజుల రెడ్డి సర్పంచులకు శాలువ కప్పి అభినందనలు తెలిపారు.
PPM: జియ్యమ్మవలస మండలం పీటిమండ పంచాయతీలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాలు 40 ఏళ్లుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, గర్భిణీలను డోలీలతోనే తరలించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల ‘పరుగుల బామ్మ’ రామసుబ్బమ్మను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ నాయుడు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ వయసులో రన్నింగ్, షాట్‌పుట్, జావెలెన్ త్రోలో ఆమె అనేక పథకాలు సాధించి కావలికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని వారు కొనియాడారు.