• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘గిరిజన సమస్యలు పరిష్కరించాలి’

ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నూతన కలెక్టర్, ఐటీడీఏ పీవోలను కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనేతరులు 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజన హక్కుల రక్షణ కోసం 1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.

April 16, 2026 / 04:14 PM IST

జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం గరికపాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

April 16, 2026 / 04:13 PM IST

‘జన గణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది’

VZM: జనగణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని కలెక్టర్ రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం గంట్యాడ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డేటా సేకరణలో ఖచ్చితత్వం అవసరమని ప్రతి ఇంటి సమాచారం పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. అలాగే, సెల్ఫ్ ఎన్యుమరేషన్ వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.

April 16, 2026 / 04:11 PM IST

‘నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త కందుకూరి’

E.G: కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి వేడుకల్లో తూ.గో జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారావు హాజరయ్యారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం అని కొనియాడారు. ఈ వేడుకల్లో కోడూరి శాంతారామ్, మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ బూరగడ్డ పాల్గొన్నారు.

April 16, 2026 / 04:10 PM IST

మహిళల భద్రతపై అవగాహన

CTR: చిత్తూరులో మహిళల భద్రత, బాలికల రక్షణే ధ్యేయంగా శక్తి టీం ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ సదస్సులో సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ ఎలా ప్రాణరక్షణగా నిలుస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. మహిళలు తమ రక్షణ కోసం టెక్నాలజీని, పోలీసు వ్యవస్థను ధైర్యంగా వినియోగించుకోవాలన్నారు.

April 16, 2026 / 04:06 PM IST

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం

కృష్ణా: ప్రతి కార్యక్రమానికి శిలాఫలకాలు వేసే సంప్రదాయానికి స్వస్థి పలకాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో అధికారులకు సూచించారు. శంకుస్థాపనలను భూమి పూజ ద్వారాను, ప్రారంభోత్సవాలను రిబ్బన్ కటింగులతో ముగించాలని అధికారులకు సూచించారు. తాము ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాము గానీ శిలాఫలకాలపై పేర్ల కోసం కాదని చెప్పుకొచ్చారు.

April 16, 2026 / 04:03 PM IST

శ్రీశైల అన్నదాన ప్రసాదానికి విరాళం అందజేత

NDL: ప్రకాశం జిల్లాకు చెందిన రావి నాగమణి, కుటుంబ సభ్యులు ఇవాళ శ్రీశైలంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం చెల్లించారు. ఈ మేరకు వారు స్థానిక అన్న ప్రసాదం విభాగం కార్యాలయానికి చేరుకుని సహాయ కార్యనిర్వహణాధికారి సతీశ్ మల్లిక్‌ను కలిసి విరాళం అందజేశారు. విరాళం చెల్లించిన దాతకు రసీదు, ప్రసాదాలు అందించి, శేష వస్త్రాలతో సన్మానించారు.

April 16, 2026 / 04:01 PM IST

ఎర్ర చెరువుకు నీటి విడుదల

KDP: రానున్న వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా మైదుకూరులోని ఎర్ర చెరువుకు అధికారులు నీటిని విడుదల చేశారు. గతంలో వేసవి కాలంలో నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వద్ద వేచి చూడాల్సి వచ్చేదన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో పలుమార్లు నీటిని సరఫరా చేయడంతో, మున్సిపాలిటీలో ప్రస్తుతం నీటి కొరత లేదని అధికారులు తెలిపారు.

April 16, 2026 / 04:01 PM IST

పూడి శ్రీహరి అరెస్ట్‌ను ఖండించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పూడి శ్రీహరి అరెస్ట్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఖండించారు. పత్తికొండలో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ అరెస్ట్ కూటమి ప్రభుత్వ దుర్మార్గపు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని, వెంటనే పూడి శ్రీహరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 04:00 PM IST

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు

సత్యసాయి: హిందూపురం మండలం కొట్నూర్ రైల్వే గేట్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిట్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు హిందూపురం నుంచి బైకులో వస్తుండగా జేసీబీనీ ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మడకశిరకు చెందిన భరత్‌, గోరంట్లకు చెందిన అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

April 16, 2026 / 04:00 PM IST

జనగణన మొదటి దశ ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: జన గణన-2027లో భాగంగా మొదటిదశ కింద ఇవాళ నుంచి ఇళ్ల లెక్కింపు వాటిలో వసతుల గణన ప్రారంభమైంది. ఈ మేరకు స్థానిక కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విధానంలో చేపట్టిన స్వీయ గణనకు సదుపాయం ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని తెలిపారు.

April 16, 2026 / 04:00 PM IST

‘కులగణన సర్వేకు ప్రజలు సహకరించండి’

PLD: క్రోసూరులో కులగణన వలనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలు సక్రమంగా జరుగుతాయని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. సర్వేకి ఇంటింటికి వచ్చే అధికారులకు ప్రజలు సహకరించి వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన అన్నారు. మండల ప్రజలు సహకరించాలని ఎంపీడీవో కోరారు.

April 16, 2026 / 03:54 PM IST

రక్త దానం చేసిన ఉపాధ్యాయులు

W.G: ఆపదలో ఉన్నవారికి మనం ఇచ్చే రక్తం పునర్జన్మను ఇస్తుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని ఎంఈవోలు పి. పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం నరసాపురంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.

April 16, 2026 / 03:42 PM IST

‘గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి’

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

April 16, 2026 / 03:42 PM IST

పాఠశాలలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ

ప్రకాశం: కంభంలోని స్థానిక ఆదిఅంధ్ర ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లర్నింగ్ & స్టడీ మదింపు ప్రక్రియను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే లక్ష్యంగా ఉపాధ్యాయులతో మదింపు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 16, 2026 / 03:41 PM IST