• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శంకరం పంచాయతీ కార్యదర్శిగా ప్రదీప్

AKP: మాడుగుల మండలం శంకరం పంచాయతీ కార్యదర్శిగా ఐ.ప్రదీప్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చోడవరం నుంచి బదిలీపై ప్రదీప్ ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కే.నాగేశ్వరరావు రావికమతం మండలం బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీడీవో కొంకి అప్పారావును మర్యాదపూర్వకంగా కలిశారు.

April 11, 2026 / 09:14 AM IST

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సత్తాచాటిన విద్యార్థి

NDL: జూపాడు బంగ్లా మండలం తర్తూరుకు చెందిన విద్యార్థి కోవిద్ రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో ఆల్ ఇండియా 46వ ర్యాంకు సాధించినట్లు శుక్రవారం తండ్రి విశ్వనాథ రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా కోటాలో స్థానం దక్కినట్లు తెలిపారు. దీంతో గ్రామస్థులు, పలువురు విద్యార్థిని అభినందించారు.

April 11, 2026 / 09:12 AM IST

‘సామాజిక మార్పు కోసం జ్యోతిరావు పూలే కృషి’

E.G: సామాజిక మార్పు కోసం కృషి చేసిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని KVPS నాయకులు జువ్వల రాంబాబు పేర్కొన్నారు. శనివారం నిడదవోలులో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. కుల రహితం, సమాజ హితం, సమభావన లక్ష్యంతో ముందుకు వెళ్లడమే ఫూలేకు నిజమైన నివాళి అని అన్నారు.

April 11, 2026 / 09:12 AM IST

వారధిపై రాకపోకలను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీ ఓటు విలువ ఈరోజు అభివృద్ధిగా మీ ముందు ఉందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ వారధిపై రాకపోకలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఓఎన్జీసీ సీఎస్సార్ నిధులు రూ.61 లక్షలతో ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు నిర్వహించారు. దీంతో పాటు వారధిపై సోలార్ లైట్లు బిగించారు.

April 11, 2026 / 09:10 AM IST

పేకాట రాయుళ్లు అరెస్ట్.. ఎంతమందంటే..!

W.G: ఆచంట మండలం కోడేరు ఉత్తర పాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 42 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 10 కార్లు, 7 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.

April 11, 2026 / 09:08 AM IST

అమరావతి హైదరాబాద్ అనుసంధానానికి కొత్త రూట్..!

GNTR: హైదరాబాద్–అమరావతి–మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అధికారులు మూడు మార్గాలను పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్‌ఆర్, విజయవాడ బైపాస్, గుంటూరు మార్గాలపై అధ్యయనం కొనసాగుతోంది. మూడు మార్గాల సాధ్యాసాధ్యాలను అధికారులు సమగ్రంగా విశ్లేషిస్తున్నారు. ఈ మార్గాలలో అనువైనదాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు సమాచారం.

April 11, 2026 / 08:41 AM IST

అంగన్వాడీల్లో పోషణ పక్వాడ కార్యక్రమం

ASR: జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతారని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో ఎల్.దేవమణి అన్నారు. ముఖ్యంగా పిల్లలు, చిన్నారులను జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం కంఠారం సెక్టార్ పరిధిలోని బకులూరు, బాలారం అంగన్వాడీ కేంద్రాల్లో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు.

April 11, 2026 / 08:36 AM IST

ఎమ్మిగనూరులో అంబేద్కర్ జయంతి సభ

KRNL: ఏప్రిల్ 14న ఎమ్మిగనూరు MRO కార్యాలయం ఆవరణంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సభ జరగనుంది. ఈ సందర్భంగా దళిత, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జయంతి కమిటీ నేతలు శుక్రవారం పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కమిటీ నేతలు తెలిపారు.

April 11, 2026 / 08:35 AM IST

రక్తదానం చేసిన కలెక్టర్ బాలాజీ

కృష్ణా: జాతీయ సర్వే దినోత్సవ సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ బాలాజీ నిన్న రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడి, ఉత్సాహంగా ఆరోగ్యకరంగా జీవిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పాల్గొన్నారు.

April 11, 2026 / 08:27 AM IST

‘జలధార కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలి’

అన్నమయ్య: జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రతి చెరువు నీటితో నిండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు తదితర అధికారులతో చర్చించారు.

April 11, 2026 / 08:25 AM IST

సర్వేయర్ల పనితీరును ప్రశంసించిన కలెక్టర్

PPM: విలేజ్‌ సర్వేయర్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్‌ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సర్వే శాఖ ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సర్వేయర్ల సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్ల పనితీరు చూసి అన్ని శాఖల అధికారులు ప్రశంసిస్తున్నారన్నారు.

April 11, 2026 / 08:21 AM IST

‘గర్భిణీలకు సకాలంలో వైద్య సేవ అందించాలి’

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించకపోతే సంబంధిత వైద్యులకు నోటీసులు ఇవ్వాలని జేసీ సంజనా సింహ ఆదేశించారు. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రక్తం అందించడంలో జరిగిన పొరపాటుపై వివరాలు తెలుసుకున్నారు.

April 11, 2026 / 08:20 AM IST

సోలరైజేషన్ పనులను తనిఖీ చేసిన అధికారులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి ఎస్టీ, ఎస్సీ కాలనీలో జరుగుతున్న సోలరైజేషన్ పనులను సీజీఏం ఐ. పీ.సి ఉమాపతి, జనరల్ మేనేజర్ విజయన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ఏ విధంగా జరుగుతుందో పరికరాలు నాణ్యత వాడుతున్నారా లేదా అని ఆరా తీశారు. కాలనీలో ఉన్న ప్రజలకు సొలరైజేషన్ పథకం గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

April 11, 2026 / 08:20 AM IST

చందోలులో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

బాపట్ల జిల్లా చందోలు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందోలు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కాలనీలో బస చేసి, స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతలు, రాత్రి గస్తీ, స్థానిక మౌలిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

April 11, 2026 / 08:20 AM IST

సీపీఐ ఆధ్వర్యంలో మంత్రితో చర్చలు

NDL: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ పరిశ్రమ వద్ద శుక్రవారం జరగాల్సిన సీపీఐ రైతు ధర్నా వాయిదా పడింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఎస్పీ, యాజమాన్యం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఇవాళ మంత్రి సహకారంతో యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలన్నారు.

April 11, 2026 / 08:19 AM IST