• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొమరోలులో చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై

ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి కూడలి వద్ద ఎస్సై నాగరాజు శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మట్టికుండల్లో చల్లటి నీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

April 10, 2026 / 06:49 PM IST

‘ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి’

కోనసీమ: ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం రాజోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అధ్యక్షతన తాటిపాక జీఎస్ గార్డెన్స్‌లో నిర్వహించబడింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను పార్టీ నాయకులతో కలిసి స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ..  అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

April 10, 2026 / 06:47 PM IST

రైతులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

NTR: పేదల సంక్షేమంతో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. జీ. కొండూరు పీ.ఏ.సీ.ఎస్ (సొసైటీ)లో రైతులు, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సొసైటీ నుంచి రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. జీ. కొండూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతి తెలుసుకున్నారు.

April 10, 2026 / 06:45 PM IST

అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన బీజేపీ నాయకులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న 5 రూపాయలకే భోజనం నాణ్యత ప్రమాణాలను ఇవాళ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శి రవి శంకర్ రాజమండ్రిలో ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. అద్భుతమైన రుచులతో నిరుపేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ పథకంలో భోజనం రుచి చూసి ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

April 10, 2026 / 06:44 PM IST

రేపు అమరావతి మండలంలో విద్యుత్ కోత

PLD: విద్యుత్ లైన్‌ల మరమ్మతుల కారణంగా రేపు శనివారం మండలంలో విద్యుత్ కోత జరుగుతుందని ఏఈ రవికిరణ్ తెలిపారు. ఈదురు గాలులు అకాల వర్షం కారణంగా కొన్ని ప్రదేశాల్లో లైన్‌లు మరమ్మతులకు వచ్చాయని, పరిశీలన చేపడుతున్నామన్నారు. కరెంటు తీగల కింద పెరిగిన చెట్లను తొలగించనున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని పేర్కొన్నారు.

April 10, 2026 / 06:41 PM IST

లా విద్యార్థులకు ఐజీపీ రవికృష్ణ సూచనలు

GNTR: గుంటూరు జేసీ లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఏకే రవికృష్ణ NDPS చట్టంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. లా విద్యార్థులు సమాజ మార్పుకు దోహద పడాలని సూచించారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు ముప్పని హెచ్చరించారు. ‘Legal Literacy Camps’ ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచాలని తెలిపారు.

April 10, 2026 / 06:40 PM IST

కోడూరుపాడులో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం

కృష్ణా: బాపులపాడు మండలం కోడూరుపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడవ విడత నాలుగు నెలల బోనస్‌గా రూ.2,19,122ను ఛైర్మన్ చలసాని ఆంజనేయులు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాడి రైతు ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు. పశు వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తి చేయడమే లక్ష్యమని చలసాని ఆంజనేయులు తెలిపారు.

April 10, 2026 / 06:36 PM IST

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు

KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు.

April 10, 2026 / 06:36 PM IST

‘ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి’

CTR: కల్లూరు ఎస్సై జయరామయ్య పులిచెర్ల మండలంలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ లోడ్ తగదన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.

April 10, 2026 / 06:35 PM IST

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: MLA

NDL: కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేల్పనూరులో అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.

April 10, 2026 / 06:29 PM IST

‘రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలి’

PLD: రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కోసం తొలగింపులు జరిగితే బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని చెప్పుకొచ్చారు.

April 10, 2026 / 06:29 PM IST

జడ్పీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 10, 2026 / 06:28 PM IST

200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ప్రకాశం: కొమరోలు మండలం యర్రగుంట్ల గ్రామం అటవీ ప్రాంతంలో నాటు సారా బట్టీలపైన ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లుగా గిద్దలూరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరావు తెలిపారు. నాటు సారా తయారు చేయటం, విక్రయించటం నేరమని అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 10, 2026 / 06:25 PM IST

బాపట్లలో జిల్లా మలేరియా అధికారి ఆకస్మిక తనిఖీ

BPT: జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి వీ. నాగార్జున రావు శుక్రవారం బాపట్ల పట్టణంలో పర్యటించారు. సంజయ్ గాంధీ కాలనీ, చంగల్ రాయుడు తోట సచివాలయ పరిధిలోని అరవపాలెం ఏరియాలో జరుగుతున్న ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు. నీటి నిల్వల్లో దోమల లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పట్టణ వాసులకు సూచించారు.

April 10, 2026 / 06:25 PM IST

ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక న్యూస్ లెటర్: కలెక్టర్

PPM: ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా న్యూస్ లెటర్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో చాట్ జీపీటీ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సమాచారాన్ని క్రోడీకరించాలన్నారు.

April 10, 2026 / 06:25 PM IST