ELR: ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఆదివారం రూ. 4.02 కోట్లతో 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి గృహనిర్మాణ మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు.
KRNL: ఆదోనిలో డెంటల్ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ‘PGRS’ నిర్వహించనున్నట్లు పీడీ శివరాం ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాలేని వారు ఆన్లైన్లో విన్నవించుకోవచ్చన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
BPT: ఈ నెల 19న బాపట్లలో ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ.. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుకు సంఘ నేతలు ఆహ్వాన పత్రికను అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
కోనసీమ: మీ భూమి మీకే సొంతం, ఆ భూమిపై మరెవ్వరికీ హక్కు లేదు అని చాటడానికి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఆదివారం జరిగిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు.
E.G: రాజమండ్రి త్యాగరాజు సేవా సమితి మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సీఎస్ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆదివారం ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్కరణలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం గర్వకారణమన్నారు.
KDP: తొండూరు మండలంలోని ఇనగలూరులో ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడంతో కారు ధ్వంసమైంది. ఎస్సై ఘన మద్దిలేటి కథనం మేరకు.. ఇనగలూరు గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిలు అమ్మాయి విషయమై కక్ష పెంచుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ATP: ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న నిర్వహించనున్న ‘రాయలసీమ చిత్రకళ ఉత్సవం’ 10వ వార్షిక ఆర్ట్ గ్యాలరీ ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరగనుంది. కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.
BPT: గవర్నర్ ఆదివారం బాపట్ల పట్టణంలో పర్యటించారు. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇక్కడికి విచ్చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు బాపట్ల ఎంఆర్వో షలీమా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.
SKLM: మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎటువంటి అనుమతులు లేకుండా స్పా/మసాజ్ సెంటర్లు నిర్వహించిన పక్షంలో కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్కు ముందుగా పూర్తి వివరాలతో సమాచారం ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
CTR: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 16న లెక్కించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ మని నాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.
TPT: నాగలాపురం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో బీ.కే. వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించగా, దేవస్థానం పరిశుభ్రత, ప్రసాదాల నాణ్యతను ఈవో ప్రశంసించారు.
ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో కార్యవర్గం ఎన్నిక అయ్యిందని ఏఐటీయూసీ నూతన ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఇవాళ కాకినాడలో పాత్రికేయుల సమావేశంలో ప్రసాద్ నూతన నాయకత్వాన్ని పరిచయం చేశారు. అధ్యక్షులుగా తాటిపాక మధు, ఉపాధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొబ్బిలి శ్రీనివాసరావు నియమితులయ్యారని వెల్లడించారు.
CTR: నగరి మున్సిపాలిటీ కీలపట్టు బీసీ కాలనీలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో యువతకు క్రీడా పరికరాలు, విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసి ప్రోత్సహించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే, స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
TPT: పుత్తూరు పరిధిలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మహిళల రక్షణ, రోడ్డు భద్రత గురించి వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే తెలపాలని కోరారు.