• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భోగాపురం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదన

VSP: విశాఖ మెట్రోను భోగాపురం వరకు పొడిగించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. రుషికొండలో టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నందున మెట్రో అనుసంధానం ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మొత్తం 76.90 కి.మీ మేర 4 కారిడార్లను ప్రతిపాదించామని తెలిపారు.

April 13, 2026 / 08:40 PM IST

జిల్లా ఎస్పీని కలిసిన నూతన డీఎస్పీలు

EG: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ని సోమవారం ఏ. శివప్రియ, డీ.ఎస్.పీ సౌత్ జోన్, నార్త్ జోన్ డీఎస్పీ జీవన జిల్లా పోలీస్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్ట్ చేశారు. ఎస్పీ డీఎస్పిని అభినందించి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.

April 13, 2026 / 08:37 PM IST

తాగునీటి పైప్ లైన్ లీకేజీతో వృధాగా పోతున్న నీరు

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై సత్యసాయి తాగునీటి పైప్లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు వృధాగా పోతున్నాయి. దీంతో రోడ్డు మీద నీరు నిలబడడంతో వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవికాలం త్రాగునీరు వృధాగా పోతుండడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 13, 2026 / 08:36 PM IST

మే నుంచి ఇళ్ల జాబితా లెక్కింపు.!

NTR: జనగణన-2027లో భాగంగా నందిగామ పట్టణంలో మే 1 నుంచి 31 వరకు ఇళ్ల జాబితా లెక్కింపు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జీ. లోవరాజు తెలిపారు. దీనికి సంబంధించి సూపర్వైజర్‌లు, ఎన్యుమరేటర్‌లకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడత ఏప్రిల్ 15-17, రెండవ విడత ఏప్రిల్ 20-22 వరకు బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరుగుతుందని వెల్లడించారు.

April 13, 2026 / 08:26 PM IST

ప్రజల సమస్యలను పరిష్కరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు (M) తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి వీరాంజనేయస్వామి ప్రజల వినతులు స్వీకరించారు. కొండపి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీలను పరిశీలించిన మంత్రి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

April 13, 2026 / 08:20 PM IST

‘పోషణపక్వాడతో తల్లి–శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం’

VSP: ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ గాజువాకలో ‘పోషణపక్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లు విడుదల చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. మొదటి 1000 రోజులు కీలకమని, అంగన్వాడీల ద్వారా అవగాహన పెంచుతున్నామన్నారు.

April 13, 2026 / 08:20 PM IST

యువత క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా వుండాలి: SI

W.G: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆకివీడు ఎస్సై హనుమంతనాగరాజు సోమవారం హెచ్చరించారు. ఐపీఎల్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచార నేపథ్యంలో ఆకివీడు మండలం యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత బెట్టింగ్ ద్వారా జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.

April 13, 2026 / 08:10 PM IST

గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్

VZM: ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను విజయనగరం 1వ పట్టణ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 49.147 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

April 13, 2026 / 08:03 PM IST

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా లింగం శ్రీను

VSP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు లింగం శ్రీనివాసరావును రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. మాజీ సీఎం  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు దక్షిణ సమన్వయకర్త వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు.

April 13, 2026 / 08:00 PM IST

టెక్కలి డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్

SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ అకాడమిక్ ఆడిట్ చేపట్టారు. రెండు విద్యా సంవత్సరాల కళాశాల పురోగతి, విద్యా సంబంధ నాణ్యతా ప్రమాణాలపై ఆడిట్ జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమిక్ అడ్వైజర్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజి అధ్యాపకులు S. రవి బాబు వ్యవహరించారు.

April 13, 2026 / 08:00 PM IST

గ్రీవెన్స్‌లో ఎంపీడీవోకు జనసేన నాయకుడి వినతి

ASR: హుకుంపేట స్థానిక పబ్లిక్ గ్రీవెన్స్‌లో జనసేన నాయకుడు పరదాని సురేష్ ఎంపీడీవో రమాదేవికి వినతిపత్రం అందజేశారు. బారపల్లి పెంకిటి కాలనీ-గడ్డి కాలనీ వరకు సీసీ రోడ్డు, స్మశాన రహదారి, పాఠశాల ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ.. నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 13, 2026 / 08:00 PM IST

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

కృష్ణా: గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసంలో జరిగిన చోరీ కేసును టూ టౌన్ పోలీసులు సోమవారం ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు.

April 13, 2026 / 08:00 PM IST

అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

AKP: రాంబిల్లి మండలం దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్, పరికరాలు, ఏసీ వైరింగ్ దగ్ధం అయ్యాయి. సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం జరిగిందని ఎలమంచిలి ఫైర్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పివేయడం జరిగిందన్నారు.

April 13, 2026 / 08:00 PM IST

‘అక్రిడేషన్ అవకతవకల ఫిర్యాదులపై విచారణ చేయండి’

ATP: జిల్లాలో అక్రిడేషన్ మంజూరులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీనియర్ జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తినే జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. జర్నలిజం నమ్ముకున్న తమకు న్యాయం చేయాలన్నారు.

April 13, 2026 / 08:00 PM IST

‘పంటలకు అధిక యూరియా వేయవద్దు’

NLR: అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామంలో సోమవారం వివిధ పంటల్లో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు అధిక యూరియా వేయకూడదని తెలియజేశారు. మట్టి పరీక్షలు చేసిన తర్వాత, ఫలితాలు ఆధారంగా పంటలకు యూరియా, ఇతర రకాల ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో కళారాణి, పీఎసీఎస్ ఛైర్మన్ హరికృష్ణ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 08:00 PM IST