VZM: ఎల్.కోట మండలం రొంగలవానిపాలెం గ్రామంలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి దేవాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
SKLM: నందిగాం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు.
SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో “కార్యకర్తే అధినేత” కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సోమవారం ఈ సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలే టీడీపీకి బలం అని పేర్కొన్నారు ‘మై టీడీపీ’ యాప్‌ను కార్యకర్తలు ఇన్స్టాల్ చేసుకుని పార్టీ కార్యకలాపాలను అందులో అప్లోడ్ చేయాలని సూచించారు.
ATP: టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
VSP: దేశ ఐటీ పెట్టుబడుల్లో 2026 తొలి త్రైమాసికంలో బెంగళూరు $823 మిలియన్తో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ ($538 మిలియన్), ముంబయి ($402 మిలియన్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐటీ హబ్‌గా ఎదగాల్సిన విశాఖపట్నం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు రాకపోవడం, స్థిరమైన పురోగతి లేకపోవడంతో ఏపీ ఐటీ రంగం వెనుకబడుతోంది.
ATP: గుత్తి వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ASR: ప్రతీ సోమవారం కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మండలస్థాయి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రసాదరావు, తహసీల్దార్ మురళీ బాబు ప్రజలకు సూచించారు. కలెక్టర్ టీ.నిషాంతి ఆదేశాలతో, నేడు గ్రీవెన్స్ నిర్వహించామన్నారు. భూములు, రెవెన్యూ సమస్యలపై రెండు ఫిర్యాదులు అందాయన్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామన్నారు.
W.G: పెంటపాడు మండలం ముదునూరులో అద్దంకి విజయరత్నం ఆధ్వర్యంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధనాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.
AKP: ఎలమంచిలి నుంచి అనకాపల్లి వెళుతున్న ఆటోను కసింకోట మండలం పరవాడపాలెం వంతెన మీద సోమవారం లారీ ఢీకొంది. ఆగి ఉన్న ఆటోలో నుంచి ప్రయాణికులు దిగుతుండగా లారీ ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో ఏప్రిల్ 14న డా. బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయవలసిందిగా గ్రామ పెద్దలు, యువకులు టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ మురళిని ఆహ్వానించారు. మోహన్ మురళి కార్యక్రమానికి తన వంతు సహకారంగా రూ. 10,000 విరాళం అందజేశారు.
SKLM: గంగు వాడ గ్రామంలో ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ విఠల్ పాల్గొన్నారు.
TPT: సామాజిక విప్లవకారుడు, వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి బిందేశ్వరి ప్రసాద్ (బీపీ) మండల్ వర్ధంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. సోమవారం స్థానిక డీబీఆర్ రోడ్డులోని మండల్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లను ప్రతిపాదించిన గొప్ప సంస్కర్త బీపీ మండల్ అని నాయకులు కొనియాడారు.
VZM: బొబ్బిలి పట్టణంలో ఉన్న “అన్న క్యాంటీన్” ఆవరణలో ప్రజలు భోజనం చేసేందుకు నూతన షెడ్డును సోమవారం MLA బేబీనాయన ప్రారంభించారు. ఇటీవల “అన్న క్యాంటీన్” ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఎండ తీవ్రత కారణంగా భోజనం చేసేవారు ఇబ్బంది పడుతున్న సంగతి MLA దృష్టికి వచ్చింది. ఈ మేరకు MLA మున్సిపల్ అధికారులతో మాట్లాడి షెడ్డును ఏర్పాటు చేశారు.
KDP: బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె.రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ డా. చేకూరి శ్రీధర్ బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామానికి రానున్నట్లు రితేష్ తెలిపారు. ‘జలధార’ ప్రాజెక్టుపై మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమీక్ష సమావేశానికి ఆయకట్టు ఛైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
PLD: జిల్లాలో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల వల్ల అలసటకు గురయ్యే ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.