శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని కమిషనర్ హనుమంతు కుర్మారావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం స్వగృహానికి కమిషనర్ చేరుకొని స్థానికులతో సమస్యలపై చర్చించారు. బాల భారత జంక్షన్ నుంచి కిమ్స్ రోడ్డు వరకు ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
GNTR: ఈ నెల 14న SRM వర్సిటీలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్సిటీలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వేదిక వద్ద పటిష్ట బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు.
KRNL: సి.బెళగల్ మండలం తిమ్మన్ దొడ్డి గ్రామం వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రిపగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెట్టే ఇసుకను కొందరు అక్రమంగా దోచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.
SKLM: టెక్కలి డివిజన్ విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి (SC/ST) సూర్య ఘర్ ఉత్సవ్ కార్యక్రమం అమలు పై ఆరా తీశారు. పాతపట్నం నియోజకవర్గానికి 3500 సోలార్ టాప్‌లు కేటాయించారని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా గూడూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
కృష్ణా: ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో నాగాయలంక, ఏటిమొగ, గుల్లలమోద, సొర్లగొంది, పాలకాయతిప్ప, పాత ఉపకాలి గ్రామాలకు చెందిన 332 మంది మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు. మండలి వెంకట్రామ్, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మేజర్ పంచాయతీ తాజంగిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక సర్పంచ్ వంతల మహేశ్వరీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిల్లాలో యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ని నిర్వహించడం జరుగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
SS: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్మవరంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 479 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 146 మందికి శుక్లాల ఆపరేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మరో 92 మందిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని బేస్ హాస్పిటల్‌కు పంపారు.
W.G: ముత్యాలపల్లిలోని శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. జాతర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో భారీ అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని ఇవాళ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.
PPM: గుమ్మలక్ష్మీపురం(M) తాడికొండ పంచాయతీ శిఖరంపై గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సుమారు 24 కుటుంబాలు, 200కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో గిరిజనులు బిందెడు నీటి కోసం రోజూ 2 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. కొండ జాలలపై ఆధారపడుతూ తెచ్చుకుంటున్న నీరు శుభ్రంగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
SS: కదిరి నియోజకవర్గం మతనగారిపల్లిలో ఐదు రోజులుగా ఉన్న నీటి సమస్యను YCP నేత డా.బత్తల హరిప్రసాద్ పరిష్కరించారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన హరిప్రసాద్ వ్యక్తిగత చొరవతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. గడ్డు పరిస్థితుల్లో అండగా నిలిచినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
TPT: నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకుని, ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటిపై కేసు నమోదైంది.
VZM : గజపతినగరం మండలంలోని పాతబగ్గం గ్రామంలో ఉచిత సోలార్ విద్యుత్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ప్రభుత్వం ఉచితంగా సోలార్ విద్యుత్‌ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KKD: మత్స్య సంపద పెంపు కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. అద్దరిపేట నుంచి అంతర్వేది వరకు 170 కిలోమీటర్ల పరిధిలోని మత్స్యకారులు ఈ వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. నిషేధ సమయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయనుంది. మత్స్య సంపద పునరుత్పత్తికి సహకరించాలని అధికారులు తెలిపారు