• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘గ్రామం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి’

NLR: ఉదయగిరి మండల పరిధిలోని 17 పంచాయతీల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీవో ఎస్.మోహన్ రావు ఇవాళ గ్రామసభలు నిర్వహించారు. మండల పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో పంచాయతీలు కేటాయించిన ఆర్థిక నిధుల పనులు చేపట్టే విధంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

April 14, 2026 / 01:41 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

E.G: భారత రత్న Dr. B.R. అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి 108 ప్రధాన కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కేక్ కట్ చేసి జిల్లా ప్రజలు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా 108 సిబ్బంది, కొవ్వూరు నియోనేటల్ సిబ్బంది పాల్గొన్నారు.

April 14, 2026 / 01:31 PM IST

రికార్డు స్థాయి లాభాలతో డీసీసీబీ దూసుకెళ్తోంది : కిమిడి నాగార్జున

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో విశేషమైన ఆర్థిక పురోగతిని సాధించిందని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 22 కోట్ల రూపాయల ప్రొవిజనల్ లాభాలను నమోదు చేసిందని, గత ఏడాది ఇది కేవలం 7 కోట్లకు మాత్రమే పరిమితమైందన్నారు.

April 14, 2026 / 01:30 PM IST

“పీఎం సూర్యఘర్ యోజన ఉత్సవ్” పథకాన్ని ప్రారంభించిన MLA

VZM: బొబ్బిలి మండలం, రాజాచెరువువలస గ్రామంలో ప్రధాన మంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్ పథకాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అనేది రూ.75,000 కోట్ల పెట్టుబడితో కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసిన పథకమన్నారు.

April 14, 2026 / 01:25 PM IST

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపి

NLR: అంటరానితనం, అసమానతలు లేని సమాజ స్థాపనే డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఆశయమని జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఎంపి తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 01:22 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం’

సత్యసాయి: ధర్మవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం తక్షణమే అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 01:15 PM IST

‘అంబేడ్కర్ ఆశయాలు నేటికీ దిక్సూచిగా ఉన్నాయి’

KRNL: అంబేడ్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేశారని జిల్లా SP విక్రాంత్ పాటిల్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి విశేషమని కొనియాడారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలు నేటికీ దిక్సూచిగా ఉన్నాయన్నారు

April 14, 2026 / 01:15 PM IST

ఈ నెల 16 నుంచి 22 వరకు గోవా గవర్నర్ జిల్లా పర్యటన

విజయనగరం జిల్లాలో ఈ నెల 16 నుండి 22 వరకు గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పర్యటించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రత తదితర సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.

April 14, 2026 / 01:10 PM IST

అంబేద్కర్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ ఘన నివాళి

SKLM: అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కి కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. సమర్థత గల నాయకునిగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, నిజమైన సంస్కర్తగా, మన దేశ భవిష్యత్తును మార్చిన మహానుభావుడు అంబేడ్కర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన శక్తిగా అంబేడ్కర్ నిలిచారని కొనియాడారు.

April 14, 2026 / 01:10 PM IST

జీవీఎంసీలో అంబేద్కర్ జయంతి

VSP: డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కమిషనర్ కేతన్ గార్గ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత ఆయన ఆశయాలని తెలిపారు.

April 14, 2026 / 01:10 PM IST

ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

TPT: పుత్తూరు, నారాయణవనంలో డాక్టర్ B. R. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడుతూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.

April 14, 2026 / 01:09 PM IST

సామాజిక న్యాయానికి అంబేద్కర్ పునాది

ASR: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంగళవారం బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్‌టీఐ కమిషనర్ పి.ఎస్. నాయుడు మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని నిత్య జీవితంలో ఆచరించాలన్నారు. సమానత్వం, హక్కుల సాధనకు రాజ్యాంగం రూపంలో పునాది వేసిన మహనీయుడని పేర్కొన్నారు. జ్ఞానమే వ్యక్తి పురోగతికి శక్తివంతమైన ఆయుధమని తెలిపారు.

April 14, 2026 / 01:08 PM IST

పోలీస్ సిబ్బందికి యూనిఫామ్‌లను అందచేసిన ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసు సిబ్బందికి దాతల సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ యూనిఫామ్‌లను సిబ్బందికి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమని ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసు సిబ్బంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 01:05 PM IST

48వ వార్డులో అంబేద్క‌ర్ జ‌యంతి

VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-3లో మంగళవారం బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పాల్గొని గ్రామస్థులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంటరానితన నిర్మూలన, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు.

April 14, 2026 / 01:04 PM IST

వడమాలపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

TPT: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వడమాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 14, 2026 / 01:03 PM IST