KRNL: టీడీపీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్పను అధిష్ఠానం నియమించింది. పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌కు దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ప్రకాశం: పొదిలి పట్టణ ప్రజలకు నగర కమిషనర్ మారుతీరావు మంచి అవకాశం కల్పించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5% రాయితీ పొందవచ్చని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని సూచించారు.
KRNL: పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు ఆలూరులో అన్న క్యాంటీన్‌ను ఇవాళ ప్రారంభించారు. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. CM చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతిగా నిలుస్తారని కొనియాడారు. ఈ సౌకర్యం పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.
కోనసీమ: కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జనాభా గణనపై తొలిరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల తహసీల్దార్ వై. రాంబాబు, ఎంపీడీవో నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనాభా గణన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వ్యక్తి వివరాలను నిర్దిష్టంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
GNTR: తెనాలిలో అరుదైన DMD వ్యాధితో బాధపడుతున్న అశ్వర్త్ గురుదత్తకు దాతలు బాసటగా నిలుస్తున్నారు. హరీష్ కుమార్, నవ్యశ్రీ దంపతుల కుమారుడు అశ్వర్త్ కండరాల వ్యాధితో బాధపడుతూ.. సాయం కోసం ఎదురు చూస్తుండటంపై కథనం రావటంతో దాతలు ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండగా, మరికొందరు నేరుగా వెళ్లి తమ వంతు చేయూత ఇస్తున్నారు.
ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన సంగా తేజస్విని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈమె గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
E.G: అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KRNL: ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందిన కేసారం సాయిరాం బైపీసీలో 921 మార్కులు సాధించాడు. కర్నూలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చదివిన అతన్ని కూలీ పనులు చేసే తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
VSP: ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి ఏడాదిలో 37,891 మందికి గానూ 32,334 మంది (85%) ఉత్తీర్ణులై రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. రెండో ఏడాదిలో 37,422 మందికి గానూ 32,034 మంది (86%) పాసై 7వ స్థానం దక్కించుకున్నారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CTR: మహిళల్లో వేగంగా పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్‌పై ముందస్తు పరీక్షలు, అవగాహన ఎంతో కీలకమని వైద్య నిపుణులు సూచించారు. ఈ మేరకు చిత్తూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన లోపంతో చాలా మంది మూడో, నాల్గో దశలోనే ఆసుపత్రులకు వస్తున్నారన్నారని తెలిపారు. స్త్రీలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
TPT: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మట్టం శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. ఆమె ఇప్పటివరకు టీడీపీ తెలుగు మహిళ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటులో భాగంగా శ్రావణి రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అధిష్టానం నియమించడం జరిగింది. ఈ మేరకు పలువురు ఆమెను అభినందించారు.
గుంటూరు: ప్రజలు జనాభా లెక్కల స్వీయ గణనలో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ https://se.census.gov.in ద్వారా వాస్తవ సమాచారం అందించి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను అధికారులు మళ్లీ ధ్రువీకరిస్తారని చెప్పుకొచ్చారు.
AKP: జిల్లాలోని పాఠశాలల్లో పరిశుభ్రత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి చెత్త లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు భద్రత కోసం మొదటి అంతస్తులో నిద్రించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
ATP: అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కోసం మొబిస్ ఇండియా కంపెనీ రూ.1.50 కోట్ల విలువైన LED వీడియో వాల్ స్క్రీన్‌ను అందజేసింది. ఎస్పీ పి.జగదీష్ ఈ సామాగ్రిని స్వీకరించి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చని అన్నారు.
ప్రకాశం: నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన చంద్రశేఖర్ 500 మార్కులకు 463 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రశేఖర్ మండలంలోని నేతివారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి.