• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రైతులు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకోవాలి’

BPT: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని చేబ్రోలు మండల వ్యవసాయ అధికారిణి ప్రియదర్శిని సూచించారు. నారాకోడూరులో శుక్రవారం పెసర కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకునే రైతులు ఈకేవైసీ చేయించుకుని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బంది, పాల్గొన్నారు.

April 11, 2026 / 07:26 AM IST

కారు ఢీ..బాలుడికి తీవ్ర గాయాలు

KDP: పులివెందులలోని స్థానిక శిల్పారామం పార్క్‌కు వెళ్లే రోడ్డులో నిన్న రాత్రి కారు ఢీకొని బాలుడు జస్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు పులివెందులకి చెందిన శ్రీనివాసులు ఇటుకల బట్టిలో పని చేస్తున్నాడు. జస్వంత్‌ను ఇటుకల బట్టీ వద్దకు రమ్మని కోరగా అక్కడికి వస్తుండగా కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే జస్వంత్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

April 11, 2026 / 07:18 AM IST

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి

SKLM: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. రూ.2 కోట్లతో వాడాడ, అచ్చెన్న పాలెం మీదుగా ఇప్పిలి వరకు నిర్మించిన బి.టి రోడ్‌ను, వాడాడ గ్రామంలో NREGS నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్‌లను కేంద్రమంత్రి ప్రారంభించారు.

April 11, 2026 / 07:17 AM IST

కేసుల దర్యాప్తులో సాంకేతికను వాడండి: ఎస్పీ

NDL: కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీల్ పొరాణ్ సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి పాల్గొన్నారు.

April 11, 2026 / 07:15 AM IST

‘మెరుగైన సేవలను వైద్యులు అందించాలి’

KRNL: డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో రోగుల మెరుగైన సేవలను వైద్యులు అందించాలని కర్నూలు GGH సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలోని తన కార్యాలయంలో డయాగ్నొస్టిక్ వైద్యులతో సమీక్ష చేశారు. డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో శాంపిల్ సేకరణ, శాంపిల్ నమూనా, రిపోర్ట్స్ ప్రదేశంలో జనాలు భారీగా గుమిగూడటం, క్యూ లేకపోవడం గుర్తించామన్నారు.

April 11, 2026 / 07:13 AM IST

చింత చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం చింతకాయలు కోయడానికి చెట్టెక్కిన రైతు కలీల్ (58) ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గారబురుజుకు చెందిన రైతు తన గ్రామ సమీపంలోని చింత చెట్టెక్కి కాయలు కోస్తుండగా అకస్మాత్తుగా జారి కిందపడటంతో అతనికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.

April 11, 2026 / 07:12 AM IST

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు

ATP: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జ్ఞానప్రసూనాంబికా దేవి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహు-కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

April 11, 2026 / 07:11 AM IST

ఎన్‌సీసీ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులకు సీ-సర్టిఫికెట్ పరీక్షల శిక్షణ కోసం ఎస్ఎల్ఆర్ డమ్మీ గన్లు, యూనిఫామ్స్ అందజేశారు. కూటమి నాయకులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ఎమ్మెల్యే చర్చించారు.

April 11, 2026 / 07:10 AM IST

నెల్లూరులో నేటి నుంచి చేపల వేట నిషేధం

NLR: 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో శనివారం నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

April 11, 2026 / 07:07 AM IST

గుంటూరు: నేడు భారీ ఊరేగింపు

గుంటూరు: శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వార్ల ఊరేగింపు నేడు జరగనుంది. ఉత్సవ విగ్రహాలతో శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు అరండల్‌పేటలో ఆలయ కమిటీ సభ్యులు భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. దేవాలయం నుంచి నిడుముక్కల వరకు ప్రదర్శన ఉండగా, గోశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు.

April 11, 2026 / 07:01 AM IST

‘సత్పలితాలిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు’

VZM: రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లీనికిలు సత్ఫలితాలను ఇస్తున్నాయని బొండపల్లి MRO రాజేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మండలంలో 29 వినతులు వచ్చాయని,వీటిలో ఇంకా 4 సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు రెవెన్యూ సమస్యలపై స్థానిక MRO కార్యాలయంలో వినతులు అన్ని రోజుల్లో ఇవ్వవచ్చన్నారు.

April 11, 2026 / 07:00 AM IST

కావలి DSP శ్రీధర్ బదిలీ

NLR: కావలి DSPగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీధర్ శుక్రవారం బదిలీ అయ్యారు. ఒంగోలు DSPగా విధులు నిర్వహిస్తున్న వీవీ రమణ కుమార్‌ కావలి DSPగా రానున్నట్లు సమాచారం. కావలి DSPను బదిలీ చేసి వీఆర్లో ఉంచుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఈ బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

April 11, 2026 / 06:52 AM IST

‘విద్యార్థులు 9:30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి’

సత్యసాయి: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని జిల్లా కన్వీనర్ జమున బాయి తెలిపారు. విద్యార్థులు ఉదయం 9:30 గంటలకే హాల్‌టికెట్, ఆధార్ కార్డుతో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

April 11, 2026 / 06:49 AM IST

‘ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి’

ప్రకాశం: సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 11, 2026 / 06:47 AM IST

దొంగతనం కేసు ఛేదించిన సీఐకు పురస్కారం

NDL: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దొంగతనం కేసును ఛేదించిన ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణకు ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రతిభా పురస్కారం శుక్రవారం అందజేశారు. నిందితులను గుర్తించి స్వామివారి నగలను రికవరీ చేయడంపై ప్రశంసించారు. కేసులో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని కూడా అభినందించి అవార్డులు ప్రదానం చేశారు.

April 11, 2026 / 06:45 AM IST