• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ నెల 16 నుంచి 22 వరకు గోవా గవర్నర్ జిల్లా పర్యటన

విజయనగరం జిల్లాలో ఈ నెల 16 నుండి 22 వరకు గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పర్యటించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రత తదితర సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.

April 14, 2026 / 01:10 PM IST

జీవీఎంసీలో అంబేద్కర్ జయంతి

VSP: డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కమిషనర్ కేతన్ గార్గ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత ఆయన ఆశయాలని తెలిపారు.

April 14, 2026 / 01:10 PM IST

ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

TPT: పుత్తూరు, నారాయణవనంలో డాక్టర్ B. R. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడుతూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.

April 14, 2026 / 01:09 PM IST

పోలీస్ సిబ్బందికి యూనిఫామ్‌లను అందచేసిన ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసు సిబ్బందికి దాతల సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ యూనిఫామ్‌లను సిబ్బందికి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమని ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసు సిబ్బంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 01:05 PM IST

48వ వార్డులో అంబేద్క‌ర్ జ‌యంతి

VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-3లో మంగళవారం బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పాల్గొని గ్రామస్థులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంటరానితన నిర్మూలన, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు.

April 14, 2026 / 01:04 PM IST

వడమాలపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

TPT: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వడమాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 14, 2026 / 01:03 PM IST

ఇంటూరులో పీఎం సూర్యఘర్ ప్రారంభం

BPT: అమృతలూరు మండలం ఇంటూరులో పీఎం సూర్యఘర్ ఎస్సీ, ఎస్టీ పథకాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ పథకంతో లబ్ధిదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. దీంతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. వేమూరు నియోజకవర్గంలో 7,172 మంది దరఖాస్తు చేసుకున్నారు.

April 14, 2026 / 12:50 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

CTR: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

April 14, 2026 / 12:42 PM IST

నాదస్వర, డోలు విద్యార్థులకు లక్ష రూపాయల విలువైన సామగ్రి పంపిణీ

VSP: సింహాచలం దేవస్థానం ద్వారా నిర్వహించబడుతున్న నాదస్వర పాఠశాల విద్యార్థులకు మంగళవారం దేవస్థానం తరపున ప్రత్యేక వితరణ కార్యక్రమం నిర్వహించారు. నాదస్వరం, డోలు అభ్యసిస్తున్న విద్యార్థుల సాధన కోసం సుమారు రూ.లక్ష విలువగల డోలు వాయిద్యానికి అత్యంత కీలకమైన ఆకులు, మూతలు ఈఓ వెంకట్రావు అందజేశారు. ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈవో పేర్కొన్నారు.

April 14, 2026 / 12:42 PM IST

కనిగిరిలో పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభం

ప్రకాశం: కనిగిరిలో పీఎం సూర్య ఘర్ పథకం కింద SC, ST కాలనీల సౌరీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగంతో పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 12:40 PM IST

అమరావతి వరద నివారణ పనులకు టెండర్లు

GNTR: అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ఏడీసీఎల్ చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తుతున్న వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

April 14, 2026 / 12:40 PM IST

కుల వివక్ష నిర్మూలనకు అంబేడ్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయం

PPM: దేశ పౌరులకు సమాన హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి డా.అంబేడ్కర్‌ అని కురుపాం MLA తోయక జగదీశ్వరీ అన్నారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురం MRO కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలలో ఆమె పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రూపొందించి, కుల వివక్ష నిర్మూలనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు.

April 14, 2026 / 12:30 PM IST

ఎంపీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

కృష్ణా: చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ కోట విజయ రాధిక, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్చాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్యాంసన్, టైపిస్టు బ్రహ్మానందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

April 14, 2026 / 12:30 PM IST

బాపట్లలో తాగునీటి పేరుతో కల్తీ దందా

బాపట్ల పట్టణంలో నాణ్యమైన తాగునీటి పేరుతో నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది. పట్టణంలో సుమారు 45 వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ చాలా వరకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్‌లలో సరైన శుద్ధి ప్రక్రియలు పాటించకుండా ఉప్పు బోరు నీటిని కెమికల్స్ కలిపి తాగునీటిగా మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

April 14, 2026 / 12:30 PM IST

‘గ్రామసభలు సమస్యల పరిష్కారానికి కీలకం’

NDL: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ముఖ్యమని తహసీల్దార్, ప్రత్యేక అధికారి పి. రమాదేవి ఇవాళ తెలిపారు. మహానంది స్వర్ణ సచివాలయంలో జరిగిన గ్రామసభలో పాల్గొని, మాట్లాడారు. ముందుగా డా. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రమాదేవిని పంచాయతీ సెక్రెటరీ భాస్కర్, సిబ్బంది సన్మానించారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

April 14, 2026 / 12:28 PM IST