ప్రకాశం: జిల్లాలో పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. గురువారం చీమకుర్తి మండలం, రామతీర్థం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు నిర్మించటం జరుగుతుందని ఆయన అన్నారు.