PLD: వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.30వేలు ఇవ్వాలని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు రత్నం డిమాండ్ చేశారు. నరసరావుపేటలో శుక్రవారం అఖిల భారత రైతు సమైక్య కార్యక్రమం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధమ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కగా గృహాలు కట్టించి ఇవ్వాలన్నారు.