KRNL: జిల్లాలోని గడియారం హాస్పిటల్లో డాక్టరు, నర్స్, సిబ్బందిని నియమించి, మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి రాజశేఖర్, డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నగర కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ హాస్పిటల్ కాన్పులకు ప్రత్యేకమైన ఆసుపత్రిగా గుర్తింపు పొందిందని అన్నారు. నగర కార్యదర్శివర్గ సభ్యులు విజయ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.