GNTR: టీటీడీ పరకామణి విభాగంలో జరిగిన డాలర్ల అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సతీశ్ కుమార్, రవికుమార్‌ను భూమన కరుణాకర్ రెడ్డి చర్యలు తీసుకోకుండా కేసులను రాజీ చేశారని చెప్పారు.