VZM: నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో విద్యుత్ ను పునరుద్ధరించాలని టీడీపీ, జనసేన నాయకులు కోరారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గ్రామస్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం ఈదురుగాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి 24 గంటలు దాటినప్పటికీ పునరుద్ధరించలేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.