ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ఘోర పరాభవంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కలవరం మొదలైంది. ఆ పార్టీలోని మరికొంత మంది ఎమ్మెల్యేలు (MLAs) అసంతృప్తులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే మరికొంత మంది బయటకు వస్తారనే ప్రచారం (Fake News) జరుగుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా (Nellore District)కే చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. త్వరలోనే పార్టీ మారుతాడనే వార్త కలకలం రేపింది. ఈ ప్రచారం వైరల్ కావడంతో ఈ విషయమై ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు.
‘మాది పెద్ద రాజకీయ కుటుంబం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఇలాంటి వార్తలు రావడం కరక్టేనా? ఇది చాలా బాధాకరమైన విషయం. జగన్ (YS Jagan) నన్ను ఆత్మీయంగా చూసుకుంటున్నాడు. పార్టీలో నాకు గౌరవం లేదు అనడం తప్పు. పార్టీలో జగన్ ను నన్ను సొంత అన్నలా చూస్తాడు. నన్ను చాలా బాగా గౌరవిస్తారు. కొంత మంది చానల్స్ (Channels) ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ ను వదిలేసి వెళ్తున్నానని చెప్పి ప్రచారం చేయడం దారుణం. నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోనే నా రాజకీయ ప్రయాణం (Political Life) ఉంటుంది. నేను చనిపోయే వరకు జగన్ తోనే ఉంటా’ అని స్పష్టం చేశారు.
‘నేను ఎవరితోను సంప్రదింపులు చేయలేదు. చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న మైండ్ గేమ్ ఇది. నాడు ఎన్టీఆర్ ను కూలదోసే సమయంలో చేసినట్టు చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. గందరగోళం సృష్టించేందుకు ఈ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అవాస్తవం. పార్టీ ప్రారంభం నుంచి జగన్ కు వెన్నంటే ఉన్నా. నాకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడంపై నాకు బాధ లేదు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తప్పుడు ప్రచారం చేసిన చానల్స్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు.
‘నెల్లూరు బ్యారేజ్ కు నా తండ్రి శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు. నేను జగన్ వదిలేస్తానని ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఈ గేమ్ అంతా చంద్రబాబుదే. ఇదంతా గోబెల్స్ ప్రచారమే’ అంటూ కొట్టిపారేశారు. ‘ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వడం లేదని జగన్ పిలిచి నాతో చెబితే నాకు ఎలాంటి సమస్య లేదు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇస్తే వాళ్లను గెలిపించి జగన్ ముందుకు తీసుకెళ్తా’ అని ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపాడు.