YS Sharmila: ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో చివరి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. అసెంబ్లీ చర్చల్లో భాగంగా ప్రత్యేక హోదా విభజన హామీలపై సభలో ప్రస్తావించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హామిల అమలుకు ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి అమోదించాలని, అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని వెల్లడించారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో జత చేశారు.
సభ ప్రారంభం నాడు గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు ఇస్తూ వాక్ చేశారు. ఈ రోజు మూడవరోజు సమావేశాలు మొదలయ్యాయి. రైతంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు సభలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. స్పీకర్ వారిస్తున్నా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో, ఈరోజుకి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇందులో భాగంగా, విభజన హామీలు జ్ఞ్యాపకం చేస్తూ కేంద్రంపై కలిసిపోరాడాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారికి,… pic.twitter.com/X7AcQMfcoB