ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కార్మిక ప్రయోజనాలకు సీఎం జగన్ మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమ బోర్డు (Labour Welfare Board) నిధులు సుమారు రూ.1,200 కోట్లు మాయం చేశారని ఆరోపించారు. కార్మికుల పొట్టగొట్టిన పాలకులకు శ్రమజీవుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లు ఇసుక విధానం (Sand Policy) మారిందని తెలిపారు. కార్మికులు దాచుకున్న సొమ్మును ఇష్టానుసారం వాడుకుందని చెప్పారు. సెస్ (Sess) రూపంలో జమైన రూ.1,200 కోట్లు ఎలా మాయం చేశారో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును భ్రష్టు పట్టించి కార్మికులకు అందించాల్సిన పెళ్లి కానుక, ప్రసూతి సమయంలో అందించే డబ్బులను నిలిపేశారని పేర్కొన్నారు.
‘కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే రూ.20 వేల సహాయం ఆపేయడం దుర్మార్గం. కార్మికుల తరఫున నిజాయతీగా పోరాడిన ఘనత జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు దక్కుతుంది’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.