Vundavalli Sridevi: అందుకే టిక్కెట్ ఇచ్చారన్న భర్త
మా బలం చూసి మాకు టిక్కెట్ ఇచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. తామిద్దరం డాక్టర్లమని, అప్పుడు లక్ష రూపాయలు పెట్టీ కొన్న భూమి ఇప్పుడు పది కోట్లు అయిందని అలా తమ ఆస్తులు పెరిగాయని చెప్పారు.
మా బలం చూసి మాకు టిక్కెట్ ఇచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ (MLA Undavalli Sridevi husband) అన్నారు. తామిద్దరం డాక్టర్లమని, అప్పుడు లక్ష రూపాయలు పెట్టీ కొన్న భూమి ఇప్పుడు పది కోట్లు అయిందని అలా తమ ఆస్తులు పెరిగాయని చెప్పారు. అలాంటి. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) పది కోట్ల రూపాయలకు ఆశపడి క్రాస్ ఓటింగ్ కు (Cross Voting) ఎందుకు పాల్పడుతామని అవేదన వ్యక్తం చేశారు. తమది ఇంటర్ క్యాస్ట్ మారేజ్ అని, ఇక్కడ తమ కాపు ఓట్లు 15 వేలు ఉన్నాయని, అప్పటికే ఇక్కడ వైసీపీ వెనుకబడి ఉందని, తాము పోటీ చేస్తే సామాజికవర్గ ఆధారంగా గెలుస్తామని లెక్కలు వేసుకున్నారని అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంత సీటు గెలిచినందుకు జగన్ (AP CM YS Jagan) తమను అభినందించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి తమను అవమానించడాన్ని తాము తట్టుకోలేక పోతున్నామని వాపోయారు. రాజధానిగా అమరావతే ఉండాలన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. జగన్ కొట్టిన దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయిందని, తనపై ఆరోపణలు చేసిన వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తానన్నారు. తాను ఇప్పుడు స్వతంత్రురాలినని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం (Constitution) ప్రకారం 2024 వరకూ తానే ఎమ్మెల్యేనని, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఏ రాజ్యాంగం అమలవుతుందో తనకు తెలియదన్నారు. ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని, దీనిపై ఇంకా సమయం ఉందన్నారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని వైసీపీ ) గుండాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏమైనా మాఫియా డాన్నా అని నిలదీశారు. డాక్టర్ సుధాకర్, అచ్చెన్నలు ఎలా చనిపోయారో తెలుసని, వారి మాదిరిగా ఎమ్మెల్యే శ్రీదేవి చనిపోకూడదనే తాను ఇన్నాళ్లు బయటకు రాలేదని అన్నారు. దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారన్నారు. తాను, తన భర్త ప్రముఖ డాక్టర్లమని, తమకు రెండు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. మహిళను అని చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తాను రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా ఉంటానని, అమరావతి (Amaravati) పోరాటంలో ఇప్పటి నుంచి రాజధాని రైతుల పోరాటంలో తాను భాగస్వామిని అవుతానన్నారు.