»Viral Video Gvmc Employees Dance In Conference Hall
Vizag కార్యాలయాన్ని పబ్ గా మార్చేసిన ఉద్యోగులు.. తీన్మార్ డ్యాన్స్ లు
కాన్ఫరెన్స్ హాల్ లో సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. క్లబ్ లు.. పబ్ ల్లో మాదిరి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డింగ్ డ్యాన్స్ లు మాదిరి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగమంతా గులాంగిరీ చేస్తున్నది. విద్యాలయాల వీసీలు, పోలీస్ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నత అధికారులు వైఎస్సార్ సీపీ పార్టీ (YSRCP) కార్యకర్తలుగా మారిపోయారు. ఇది చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా ఓ చోట ఉద్యోగులు (Employees) రెచ్చిపోయారు. కార్యాలయంలోనే విందు చేసుకుని డ్యాన్స్ లు చేశారు. కేకలు వేస్తూ డ్యాన్స్ లు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation Office) కార్యాలయాన్ని పబ్ (Pub)గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఏపీలోనే విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) (Greater Visakhapatnam Municipal Corporation- GVMC) అతి పెద్దది. లక్షల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్న నగరం. ఆర్థిక సంవత్సరంలో (Economic Year) రికార్డు స్థాయిలోG ఆస్తి పన్ను అధికార యంత్రాంగం వసూలు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ లెక్కలన్నీ పూర్తి చేశారు. అయితే ప్రజలను పీల్చి పిప్పి చేసి వసూళ్లు చేయడంతో భారీ స్థాయిలో పన్ను (Tax Collection) వసూళ్లు జరిగాయి. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫుల్ ఎంజాయ్ చేశారు.
లక్ష్యానికి మించి వసూళ్లు చేయడంతో కార్యాలయంలోనే విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. క్లబ్ లు.. పబ్ ల్లో మాదిరి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డింగ్ డ్యాన్స్ లు మాదిరి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. సచివాలయ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శి అధికారికంగా సమావేశాలు నిర్వహించే చోట డ్యాన్స్ లు చేయడం కలకలం రేపుతున్నది. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.