వైపీపీ నేత, థర్టీ ఇయర్స్ పృథ్వీ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. పృద్వి భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.
విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి పృద్వి తో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను తరచూ వేధించేవాడని ఆరోపించారు పృథ్వీ భార్య.
వేధింపులు ఏక్కువై తనను ఇంటి నుంచి గెంటేశాడని దీంతో పుట్టింటికి చేరుకున్నానని ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొంది. సినిమాలు,ఇతర షో ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు రూ. 30 నుండి 40 లక్షల వరకు సంపాదిస్తున్నారని ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని పిటిషన్లో పేర్కొంది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఇందిరా ..శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రతి నెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు.