»Vijayawada Apsrtc To Introduce Multi City Ticketing System
APSRTC శుభవార్త: ఒక టికెట్.. రెండు బస్సుల్లో ప్రయాణం
దూర ప్రయాణానికి కొన్ని చోట్ల నేరుగా అక్కడకు బస్సులు ఉండకపోవచ్చు. రెండు బస్సులు మారి అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో ఏ బస్సు ఎక్కితే ఆ బస్సులో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా తీసుకొచ్చిన పథకంతో ఇకపై రెండు టికెట్లు తీసుకోనవసరం లేదు.
ప్రయాణికులకు (Passengers) సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) (Road Transport Corporation) లు కృషి చేస్తున్నాయి. తెలంగాణలో (TSRTC) విప్లవాత్మక నిర్ణయాలు తీసుకువస్తుండగా దీనికి ధాటిగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) పలు కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా ఒకే టికెట్ (Ticket) రెండు బస్సుల్లో ప్రయాణించే అవకాశం తీసుకువచ్చింది. ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ (Multi City Journey Reservation) పేరిట తీసుకువచ్చిన ఈ పథకం వివరాలు ఏమిటో తెలుసుకోండి.
దూర ప్రయాణానికి కొన్ని చోట్ల నేరుగా అక్కడకు బస్సులు ఉండకపోవచ్చు. రెండు బస్సులు (Bus) మారి అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో ఏ బస్సు ఎక్కితే ఆ బస్సులో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా తీసుకొచ్చిన పథకంతో ఇకపై రెండు టికెట్లు తీసుకోనవసరం లేదు. ఒకటే చోట తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకొని రెండు బస్సులో ప్రయాణించవచ్చు. ఉదాహరణకు విజయవాడ నుంచి చీరాల (Chirala) వెళ్లాలి అనుకోండి. చీరాలకు విజయవాడ నుంచి నేరుగా బస్సు లేదు. గుంటూరులో దిగి అక్కడి నుంచి చీరాలకు వెళ్లాల్సి ఉంటుంది.
మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ తో విజయవాడలో (Vijayawada) చీరాలకు టికెట్ తీసుకోవాలి. విజయవాడలో బస్సెక్కి గుంటూరు దిగాలి. గుంటూరులో (Guntur) చీరాల బస్సు ఎక్కితే కొత్తగా టికెట్ కొనాల్సిన అవసరం లేదు. మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ చూపిస్తే చాలు. ఈ సౌకర్యంతో ప్రయాణికులకు కొంత మేలు జరుగుతుంది. ఈ టికెట్ 2 నుంచి 22 గంటల వరకు గడువు ఉంటుంది. ఈ కొత్త పథకం ప్రయోగాత్మకంగా 137 మార్గాల్లో అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల స్పందనను చూసి మిగిలిన మార్గాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. కాగా మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ టికెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.