వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ట్రోల్స్ చేస్తోంది. లాయర్లకు ఇచ్చే ఫీజుల విషయం గురించి విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలను టీడీపీ ట్రోల్స్ చేయడం చర్చనీయాంశమైంది.
ఏపీ సీఎం జగన్ (CM Jagan) అక్రమాస్తుల కేసులో ఏ2గా విజయసాయిరెడ్డి (Vijayasaireddy) ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. శనివారం పార్లమెంట్ సమావేశాల్లో విజయసాయిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై టీడీపీ (TDP) దారుణంగా ట్రోల్స్ (Trolls) చేస్తోంది.
పార్లమెంట్(Parliament)లో విజయసాయిరెడ్డి(Vijayasaireddy) ప్రసంగిస్తూ..గత నాలుగేళ్లుగా వైసీపీ(YCP) ప్రభుత్వంపై దాఖలైన కోర్టు కేసులకు సంబంధించి విజయసాయిరెడ్డి ప్రసంగించారు. లాయర్లు తమపై భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని, ఒక్కో కోర్టుకు హాజరవ్వడానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
ఒక్కసారి చెల్లిస్తే పూర్తయ్యేది కాదని, మరో సెషన్‌కు తమ లాయర్లు హాజరుకావాలంటే వారికి మరోసారి రూ.50 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని విజయసాయిరెడ్డి పార్లమెంట్(Parliament)లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ ట్రోల్స్(TDP Trolls) చేస్తోంది. విజయసాయిరెడ్డి (Vijayasaireddy)ని ఎగతాళి చేస్తూ ట్వీట్స్ చేస్తోంది.
వైసీపీపై ఉన్న 36 కేసులకు కూడా న్యాయవాదులను నియమించుకోలేకపోతున్నారని, ఏపీ రాష్ట్రంలోని అప్పులు వారి న్యాయవాదులకు(Lawyers) సరిపోవడం లేదని, అందుకే లాయర్ల ఫీజులు తగ్గించాలని సాయిరెడ్డి పార్లమెంట్లో చెప్పినట్లు టీడీపీ ట్రోల్స్ (TDP Trolls) చేసింది. సాక్షాత్తూ ఏపీ ప్రభుత్వం ఖాజానా నుంచి వైసీపీ (YCP) ప్రభుత్వంపై పెట్టిన కేసులకు భారీగా ఫీజులు చెల్లిస్తున్నారని టీడీపీ ట్వీట్స్‌లో తెలిపింది. వైసీపీ సొంత కేసులకు ప్రజా ధనం వెచ్చించడం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది.