Andhra Pradesh, Manyam district, the situation is even worse. If you get fever, you have to cross Nagavali river
Viral News: ప్రపంచంలో భారతదేశం(India) అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పే నాయకులకు సామాన్యుల బాధలు కనిపించవు. స్వాతంత్య్రం(Independence) వచ్చి 75 ఏళ్లు దాటిందని సంబరాలు చేసుకుంటున్నాము. కానీ, ఇంకా కరెంట్ లేని పల్లెలు, వైద్యం అందని పేదలు, ఆకలి చావులు, ఆర్తనాదాలు అలాగే ఉన్నాయి. వానలు వస్తే వరదలతో పాటు జబ్బులు(Diseases) వస్తాయి. వరదలు పోయేలోగా రోగి ప్రాణాలు పోతాయి. కారణం ఆయా గ్రామంల్లో జబ్బు చేస్తే చూడడానికి వైద్యుడు(Doctor) అంటూ ఎవరు ఉండరు. ముంచే వరదలు వచ్చినా, కొండలు పగిలే ఎండలు కాచినా, ఎముకలు కొరికే చలిపెక్కినా చికిత్స కోసం మైళ్లదూరం వెళ్లాల్సిందే. ఇలాంటి పరిస్థితులు దేశంలో చాలా చోట్ల ఉన్నా ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని మన్యం జిల్లాలోని ఘటన మనసును కలిచివేస్తుంది. ఇంకా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని పాలకులను, అధికారులను నిలదీయాలనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొమరాడ మండలం నాగావళి నది(Nagavali river) అవతల చోళ్లపదం గ్రామ పంచాయతీ పరిధిలోని రెబ్బ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక మరియకు జ్వరం వచ్చింది. వర్షాలతో ఆ పల్లే వరదల్లో కూరుకుపోయింది. దీంతో తనకు ఎంతకు జ్వరం తగ్గకపోవడంతో పక్క ఊర్లో వైద్యం చేయించాలంటే నది ఉధృతంగా కొనసాగుతుంది. ఇక చేసేది ఏమిలేక ఆమె తండ్రి సోమయ్య గ్రామస్థుల సాహాయంతో వెదురు కర్రలతో తాత్కాలిక పడవను తయారు చేసి నది దాటించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జ్వరం వచ్చినా ఈ వాగు దాటాల్సిందే
ఆంధ్ర ప్రదేశ్ – మన్యం జిల్లా కొమరాడ మండలం నాగావళి నది అవతల ఉన్న చోళ్లపదం గ్రామ పంచాయతీ రెబ్బ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక మరియకు జ్వరం రాగా వైద్యం చేయించేందుకు ఆమె తండ్రి సోమయ్య సహా గ్రామస్థులు ఇలా వెదురు కర్రలతో పడవలా చేసి నది దాటించి వైద్యం… pic.twitter.com/Uk7XbkLVRm