»The Opposition Leaders Expressed Their Anger Against Jagan Saying That Injustice Is Being Done To The State In The Case Of Krishna Waters Rayalaseema Traitor
Andra Pradesh: రాయలసీమ ద్రోహి ఎవరంటే?
కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాల నేతలు జగన్పై మండిపడ్డారు.
Andra Pradesh: కృష్ణ జలాల పంపిణీపై పున:పరిశీలనకు కేంద్రం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ అధ్వర్యంలో కడపలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సాగునీటి రంగ నిపుణులు హాజరయ్యారు. కృష్ణా జలాల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కానీ కేంద్రంపై సీఎం జగన్ ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని విమర్శించారు. విపక్షాలన్నీ ఏకం అయి వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని తెలిపారు. ఈ జలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి.. ప్రభుత్వ పోరాటం చేయడానికి ప్రణాళిక రూపొందించాలి.
జగన్ ఢిల్లీలో ఉన్నప్పుడే కేంద్రం కృష్ణా జలాల పున:పంపిణీపై నోటిఫికేషన్ ఇచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. జగన్ తాడేపల్లిలో ఉన్నా, విశాఖలో ఉన్నా ప్రజలకు లాభం ఏం లేదు. గతంలో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం జరిగింది. అందులో జగన్ ఏమీ మాట్లాడకపోవడం దారుణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్కు తెలంగాణలో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, కేంద్రంతో కేసుల సమస్య ఉందని రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ, బీఆర్ఎస్కు తాకట్టు పెట్టారు. మోదీ చర్యలతో, జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు.