AP Hates Jagan, Bonda Uma Counter To Why AP Need Jagan Programme
Bonda Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ(Bonda Uma) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి తెలిసిందే. హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలు చేసే సమయానికి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు టాపిక్ లేదని బొండా ఉమ అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో హెరిటేజ్ సంస్థ ఎన్నో భూములను కోల్పోతుందని తెలిపారు.అలైన్మెంట్ విషయంలో ఎలాంటి తప్పులు ఎక్కడ కూడా జరగలేదని బొండా ఉమ తేల్చిచెప్పారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కేసులు నమోదు చేశారని బొండా ఉమ వ్యాఖ్యానించారు.
వైసీపీ అబద్ధాలు మాట్లాడుతూ నిజం చేసే ప్రయత్నం చేస్తుందని బొండా ఉమ అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పి.నారాయణ అద్దె భవనంలో కాలేజీని నిర్వహిస్తున్నారు. దీనికోసం అలైన్మెంట్ మార్చారని తప్పుడు ఆరోపణలు కూడా చేశారని మండిపడ్డారు. అద్దె భవనం కోసం అలైన్మెంట్ మార్చమని ఎవరైనా కోరుతారా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాదం దరిద్రమని.. ఏపీలో జగన్ అడుగుపెట్టగానే అమరావతి నాశనం అయ్యిందని బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి ఆయనను జైళ్లో ఉంచారు. ఎలాంటి తప్పుడు కేసులు అతనిపై నిలబడలేవని తెలిపారు.