»Suffered With Cm Jagan Words Mekapati Chandrasekhar Reddy
Last chance అన్న వినలే.. టికెట్ ఇవ్వనని జగన్ చెప్పడంతో బాధపడ్డా:మేకపాటి
mekapati chandrasekhar reddy:ఏపీ సీఎం జగన్‌పై (jagan) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని కోరితే వినలేదని గుర్తుచేశారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పారని.. ఒక్క ఛాన్స్ (chance) ఇవ్వమని అడిగినా వినిపించుకోలేదని చెప్పారు.
Suffered with cm jagan words mekapati chandrasekhar reddy
mekapati chandrasekhar reddy:ఏపీ సీఎం జగన్‌పై (jagan) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని కోరితే వినలేదని గుర్తుచేశారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పారని.. ఒక్క ఛాన్స్ (chance) ఇవ్వమని అడిగినా వినిపించుకోలేదని చెప్పారు. టికెట్ కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. ఉదయగిరిలో తనకన్నా బలమైన నేత లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) తెలిపారు. టికెట్ ఇవ్వనని జగన్ చెప్పడంతో బాధపడ్డానని వివరించారు. నియోజకవర్గంలో తాను తప్ప మరెవరూ గెలవలేరని చెప్పానని వివరించారు.
వైఎస్ హయాం నుంచి ఉదయగిరి డెవలప్ మెంట్ కోసం పోరాడుతున్నానని వివరించారు. తనకు సంబంధించి జగన్‌కు (jagan) ఏం చెప్పినా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని మరోసారి స్పష్టంచేశారు. హై కమాండ్ సూచింని అభ్యర్థికే ఓటు వేశానని తెలిపారు.
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయలేదని.. తనే పార్టీని వీడానని తేల్చిచెప్పారు. టీడీపీ నేతలతో సంప్రదింపులు జరపలేదని చంద్రశేఖర్ రెడ్డి (chandrasekhar reddy)పేర్కొన్నారు. వారు వస్తే మాత్రం చర్చలు జరుపుతానని చెప్పారు. ఉదయగిరిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిచేది తానేనని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు పోటీ ఎవరైనా రావొచ్చని సవాల్ విసిరారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (anuradha) విజయం సాధించారు. అనురాధకు ఆనం రాంనారాయణ రెడ్డి (anam ram narayana reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy), ఉండవల్లి శ్రీదేవి (sirdevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (chandra shekar reddy) ఓటు వేశారట.. వారిని సస్పెండ్ చేశామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు మేకపాటి బ్రదర్స్ హవా నడిచేది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాష్ట్రంలో మంచి పలుకుబడి ఉండేది. వైఎస్ఆర్తో సన్నిహితంగా మెలిగేవారు. జగన్‌తో కూడా ఆ ర్యాపో మెయింటెన్ చేశారు. రాజమోహన్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి ప్రభ తగ్గుతూ వచ్చింది. దీనికితోడు రెండో భార్య కుమారుడు మీడియాకు ఎక్కడం మైనస్ అయ్యింది.