»Scam At Shirdi Sai Electricals Transformers Tenders
Jagan Reddyకి ఇద్దరు దత్తపుత్రులు: సోమిరెడ్డి
ఏపీ సీఎం జగన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు ఉన్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అరబిందో కంపెనీ ఓనర్, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ యజమాని ఇద్దరూ జగన్ దత్తపుత్రులేనని తెలిపారు.
Scam At Shirdi Sai Electricals Transformers Tenders
Somireddy Chandra Mohan Reddy: ఏపీ సీఎం జగన్‌కు ఇద్దరు దత్తపుత్రులు ఉన్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) ఆరోపించారు. అరబిందో సంస్థ యాజమాని ఒకరు కాగా.. మరొకరు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఓనర్ అని చెప్పారు. ఆ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండో సోల్ సోలార్ సంస్థ అని వివరించారు.
ఇండో సోల్ సోలార్ సంస్థ వయస్సు 18 నెలలు మాత్రమేనని సోమిరెడ్డి (Somireddy) వివరించారు. సంస్థను దత్తత తీసుకొని, అందుకు బహుమతిగా రూ.75 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారని ఆరోపించారు. షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని గతంలో వెలుగులోకి తీసుకొచ్చామని చెప్పారు. 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ హయాంలో రూ.58 వేలు ఉందని.. ఇప్పుడు దాని ధర 223.98 శాతం పెంచిరూ.1.78 లక్షలకు కొనుగోలు చేశారని తెలిపారు.
315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర కూడా గతంలో రూ.5.17 లక్షలు ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో రూ.8.60 లక్షలు ఉందన్నారు. ఏపీలో మాత్రం రూ.16.75 లక్షలకు కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ఏడాదిలో పక్క పక్కనే ఉన్న రాష్ట్రాలు ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు ధరల విషయంలో ఇంత తేడా ఎందుకు ఉందని అడిగారు. షిరిడిసాయి సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉందని.. ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని అడిగారు.
స్మార్ట్ మీటర్ల స్కాంపై హైకోర్టులో పిల్ వేశానని.. ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణంపై కూడా కూడా పిటిషన్ వేస్తానని సోమిరెడ్డి స్పష్టంచేశారు.రాష్ట్రంలో అరబిందో, షిరిడిసాయి తప్ప ఇతర కంపెనీలు లేవా..? అని అడిగారు. మూడు డిస్కంలకు సంబంధించి జరిగిన వ్యవహారాల గురించి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఆ స్కాంలు బయటకు వస్తే సీఎం జగన్ లైఫ్ టైమ్ జైలులోనే ఉంటారని సోమిరెడ్డి (Somireddy)స్పష్టంచేశారు.