»Police Are Security To Ex Minister Anil Kumar Flexi
ex minister flexiకి పోలీసుల కాపాలా.. ఏకంగా 15 మంది సెక్యూరిటీ, ఎక్కడంటే
Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు.
Police are security to ex minister anil kumar flexi
Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) ప్లెక్సీకి నెల్లూరు నడిబొడ్డున పోలీసులు (police) సెక్యూరిటీగా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు. ఇదేమి చిత్రం.. ప్లెక్సీకి పోలీసులా కాపాలానా అని ఆశ్చర్యపోయారు.
రెండురోజుల క్రితం అనిల్ కుమార్ (anil kumar) బర్త్ డే (birth day) కావడంతో నెల్లూరు (nellore) నర్తకి సెంటర్లో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీ (flexi) ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డుగా ఉందని టీడీపీ మెలిక పెట్టింది. దీంతో ప్లెక్సీకి పోలీసులు భద్రత కల్పించక తప్పలేదు. ప్లెక్సీని తొలగించాలని టీడీపీ నగర ఇంచార కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి (kotamreddy srinivasulu reddy) మున్సిపాలిటీ అధికారులను కోరారు. మరోవైపు ఇటీవలే టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (kotamreddy giridhar reddy) నిన్న (ఆదివారం) నర్తకి సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఆ సమయంలో అనిల్ (anil) ప్లెక్సీ ఎవరైనా తొలగిస్తారనే అనుమానంతో పోలీసులు (police) పహారా కాశారు.
ప్లెక్సీకి (flexi) పహారా కాయడం ఏంటీ అనే చర్చ జరిగింది. నిజమే.. పోలీసులు ఉంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా.. నేతలకు భద్రత (protection) అంటే ఓకే.. మరీ ప్లెక్సీలకు కూడా సెక్యూరిటీ అని ఆశ్చర్య పోతున్నారు. ప్లెక్సీకి 15 మంది పోలీసులు కాపాలా ఉండగా.. వారిలో ఒకరు సీఐ ఉన్నారు.
నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) ఇదివరకు మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయనకు తిరిగి అవకాశం లభించలేదు. జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy) మాత్రం మంత్రిగా ఉన్నారు. మంత్రి పదవీపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ఆశపడ్డారు. కానీ ఆయనకు విప్ పదవీ కూడా వరించలేదు. దీంతో పార్టీ, అధినేత జగన్‌పై (jagan) ధిక్కార స్వరం వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు సంబంధించి ఇటీవలే ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన కూడా టీడీపీలో చేరతారు. ఇంతలో ప్లెక్సీ కోసం భద్రత కల్పించడం చర్చకు దారితీసింది.