జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఖరారు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర కాదు.. చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని సూచించారు.
Pawan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan) వారాహి యాత్ర ( Varahi Yatra) ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి వాహనం రోడ్డెక్కుతుందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రూట్ మ్యాప్ ఖరారు అయ్యిందని.. తొలి విడత తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతోందని వివరించారు. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల తర్వాత యాత్రం ప్రారంభం అవుతోందని తెలిపారు. ప్రారంభ యాత్ర అన్నవరం నుంచి భీమవరం కొనసాగుతుందని వివిరంచారు.
రూట్ మ్యాప్ ఇలా
ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూల్, ముమ్మిడివరం, రాజులు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో తొలి విడత యాత్ర (Varahi Yatra) జరుగుతుందని నాదెండ్ల మనోహర్ వివరించారు. ప్రతీ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుందని చెప్పారు.
దసరా, సంక్రాంతి, ఉగాది పోయే
పవన్ వారాహి యాత్ర (Varahi Yatra) ఖరారు అయ్యిందో లేదో అధికార వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. షూటింగ్ లేకే పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్దమయ్యారని మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) ఆరోపించారు. వారాహి మీద పవన్‌ది టూర్ ప్యాకేజీనా అని అడిగారు. వారాహికి ఇన్ని రోజులు ఎందుకు బ్రేక్ ఇచ్చారని ప్రశ్నించారు. దసరా పోయింది.. సంక్రాంతి వెళ్లింది.. ఉగాది వెళ్లిన ఇన్నాళ్లకు యాత్ర గుర్తొచ్చిందా అని అడిగారు. అన్నవరం, భీమవరం కన్నా చంద్రవరం యాత్ర అని మొదలు పెడితే బాగుండేదని సూచించారు.
సినిమా మాదిరిగా హడావిడి
సినిమా ప్రారంభోత్సవం రోజున ఇలా తెగ హడావిడి ఉంటుందని పేర్నినాని (perni nani) గుర్తుచేశారు. మూవీ అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఆ తర్వాత దాని ఊసే ఉండదన్నారు. పవన్ (pawan) వ్యవహార శైలి కూడా అలానే ఉందన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) మాట్లాడుతూ.. అసలు ఇప్పటివరకు యాత్ర ఎందుకు ప్రారంభం కాలేదని అడిగారు. పవన్ కల్యాణ్‌ను నమ్మి జన సైనికులు మోస పోతారని.. జాగ్రత్త అని సూచించారు.