జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి విజయ యాత్ర(Varahi Victory Yatra) నిర్వహించారు. వైసీపీ (YCP) నేతలతో జరుగుతున్న చెప్పుల యుద్ధంపై పవన్ వ్యంగ్యాస్త్రం విసిరారు. “నా రెండు చెప్పులు ఎవరో కొట్టేశారు. వైసీపీ ప్రభుత్వం గుడిలో కూడా నా రెండు చెప్పులు పట్టుకుని వెళ్లిపోతోంది. నా చెప్పులు దొంగిలించింది ఎవరో కనిపిస్తే పట్టుకోండి… నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్” అంటూ పవన్ అన్నారు.
తనకు క్రిమినల్స్(Criminals) అంటే చిరాకు అని స్పష్టం చేశారు. “నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్లా మనలను పాలించేది.. ఈ దరిద్రులా మనల్ని పాలించేది. ఈ సన్నాసులా మనల్ని పాలించేది… గూండా గాళ్లు, రౌడీలు, హంతకులు… సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లతో పాలింపబడడానికి” అంటూ పవన్ ఆగ్రహంతో విమర్మించారు. తానేమీ సినిమా (movie)మాటలు మాట్లాడడంలేదని, సినిమాలు కంటే నిజ జీవితం లోనే ఎక్కువ చేస్తానని, గొడవలు అంటే తనకేమీ భయం లేదని స్పష్టం చేశారు. తాను తెగించి పోరాడతానని అన్నారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై వైసీపీ కన్ను పడింది.
తిరుమల(Tirumala)లో శ్రీవారి ట్రస్టు ఉంటుంది. ఇక్కడ 10 వేలు విరాళం ఇస్తే, రూ.300కి బిల్లు ఇస్తారు… మిగతా రూ.9 వేల పైచిలుకు ఎటు వెళతాయో ఎవరికీ తెలియదని ఆయన ఆరోపించారు.వైసీపీ దోపిడీదారులకు ఒకటే చెబుతున్నా… ఏడుకొండల స్వామితో ఆడుకుంటున్నారు… ఒక్కొక్కడు నామరూపాల్లేకుండా పోతారు. ఆలయాల విధ్వంసం ఘటనల్లో ఈ సీఎం ఒక్కరినైనా పట్టుకున్నారా?” అని ప్రశ్నించారు. తాను సనాతన హిందువునని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. కానీ ఈ చచ్చు వైసీపీ ప్రభుత్వం మతాల విద్వేషం రెచ్చగొడుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.