»We Will Welcome Hyderabad As The Second Capital Of The Country Ponnam Prabhakar
Ponnam Prabhakar : దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ స్వాగతిస్తాం : పొన్నం ప్రభాకర్
హైద్రాబాద్ (Hyderabad) ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) ప్రధానిమోదీకి (PM Modi) ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు.
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే సంతోషమేనని, దీన్ని తాము స్వాగతిస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు.రెండో రాజధానికి కావాల్సిన అన్ని లక్షణాలు హైదరాబాద్ కు ఉన్నాయని అన్నారు. అయితే, సెకండ్ క్యాపిటల్ కావడం వల్ల హైదరాబాద్ కు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.మహరాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
దేశ రాజధానికి (capital) హైదరాబాద్ (Hyderabad) మరో రాజధాని కావాలని ఆయన అన్నారు. ఒకవేళ మరో రాజధాని అయ్యే అవకాశం హైదరాబాద్‌కు మాత్రమే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రెండో రాజధాని కావాలనే విషయాన్ని అంబేద్కర్ కూడా చెప్పారని, రాజ్యాంగంలో ఆ విషయం ఉందని అన్నారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఈ అంశంపై తమ పార్టీ పార్టీతో చర్చిస్తామన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని కావడం ఎదో జరుగుతుందనుకోవడం అపోహ మాత్రమేనని పొన్నం ప్రభాకర్ అన్నారు.