Pavan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పవన్ ఆయన్ని కలిశారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోపై ఇంతకు ముందే ఇద్దరూ భేటీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తరచుగా సమావేశమయ్యి పార్టీ పొత్తు ప్రక్రియకు తొందరగా చర్యలు తీసుకోవాలని సమావేశమయ్యారని అభిప్రాయ పడుతున్నారు.
ఈ భేటీలో పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వచ్చే మార్చిలో సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ పరంగా పూర్తిచేయాల్సిన పనులు ప్రారంభించాలని తెలిపారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ వివాహ వేడుకల కోసం ఇటలీలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత సమావేశం అవుతారని అనుకున్నా.. మధ్యంతర బెయిల్ షరతుల కారణంగా విమర్శలు వస్తాయిని ఆగిపోయారు.