• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎస్‌.కోట MLA కోళ్ల లలిత కుమారి శుక్రవారం వేపాడ, కొత్తవలస మండలాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆమె కొత్తవలసలో విజయ ఆంజనేయ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోంపురం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవం, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 20, 2026 / 07:49 PM IST

బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు

మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గల విద్యా సంస్థల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాలల సంరక్షణ అధికారి (NIC)ఎం.ఏ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టౌన్‌లో గల డీవీఎం హైస్కూల్, బెలగాం గర్ల్స్ హై స్కూల్, పలు అంశాలపై అవగాహన కల్పించారు.

February 20, 2026 / 07:49 PM IST

అల్లూరి జిల్లాకు 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు

అల్లూరి జిల్లాలోని, గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం స్వచ్ఛభారత్-స్వచ్ఛాంధ్రలో భాగంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు జిల్లాకు వచ్చాయని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ శుక్రవారం తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

February 20, 2026 / 07:46 PM IST

ఎంవీఐ తనిఖీలు.. ఐదు ఈ-ఆటోలు సీజ్

ప్రకాశం: పామూరులో శుక్రవారం వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని వాహనాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఐదు ఎలక్ట్రిక్ ఆటోలకు పెనాల్టీ విధించి సీజ్ చేశారు. ఎంవీఐ రవికుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.

February 20, 2026 / 07:45 PM IST

రైల్వే కాలనీలో వసతీగృహాల ప్రారంభం

VSP: భారతీయ రైల్వే వాల్తేయిర్ డివిజన్ ఆధ్వర్యంలో వైశాఖి రైల్వే కాలనీలో నిర్మించిన అధికారుల కొత్త వసతి గృహాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, జ్యోత్స్న బోహ్రా శుక్రవారం ప్రారంభించారు. నివాస సముదాయంలో నాలుగు టైప్–వీ, ఒక టైప్–VI క్వార్టర్ యూనిట్లు నిర్మించగా, సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసింది.

February 20, 2026 / 07:42 PM IST

కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా ఆదేశం: కమిషనర్

TPT: తిరుపతి పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని కమిషనర్ N. మౌర్య, అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో, B.P.S, L.R.S దరఖాస్తులపై కూడా చర్చించారు. అలాగే పిటిషన్ దారులు, న్యాయవాదులతో సంప్రదింపులు జరపాలని కమిషనర్ సూచించారు.

February 20, 2026 / 07:41 PM IST

స్వచ్ఛ రథం ప్రారంభించనున్న ఎమ్మెల్యే

CTR: కార్వేటి నగరంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలు తెలిపింది. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు కార్వేటినగరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛ రథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

February 20, 2026 / 07:41 PM IST

బీసీ సెల్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు బీసీ సెల్ అధ్యక్షుడు సంగేపు రంగారావు, ప్రధాన కార్యదర్శి వనకూరు విక్రమ్,కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేరేలా కృషి చేయాలన్నారు.

February 20, 2026 / 07:39 PM IST

ఆ ఘనత ఏపీకే దక్కుతుంది: ఎమ్మెల్యే

KRNL: పేదల సంక్షేమానికి అత్యధికంగా నగదు బదిలీ పథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఏపీ రాష్ట్రానికే దక్కుతుందని ఆదోని MLA పార్థసారథి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి చూపించారన్నారు. గత YCP ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 26 వేల కోట్లు వృథా చేశారన్నారు.

February 20, 2026 / 07:36 PM IST

‘దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేయాలి’

SKLM: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సామూహికంగా దాడి చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. టెక్కలిలోని ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

తిరుమలలో మోసం.. ముగ్గురు అరెస్ట్

TPT: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు తీసుకుని అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో రూ.50/100 చెల్లించి గదులు తీసుకుని, ఒక్కో గదిని రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గదిని పలువురికి ఇచ్చి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

సోలార్ సమస్యల పరిష్కారం కోసం ‘1912’ టోల్ ఫ్రీ నంబరు

అనంతపురం జిల్లాలోని సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు ‘1912’ అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. వినియోగదారులు ఈ నంబరుకు కాల్ చేసి ఐవీఆర్ఎస్‌లో 5 అంకెను నొక్కి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీని ద్వారా సోలార్ విక్రేతలు నిర్ణీత సమయంలోగా సమస్యను పరిష్కరిస్తారని వివరించారు.

February 20, 2026 / 07:30 PM IST

జాతీయ లోక్ అదాలత్‌పై ఎక్సైజ్ శాఖతో సమావేశం

తూ.గో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నిమిత్తం ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం సమావేశమైయ్యారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 07:30 PM IST

జొన్నవాడ కామాక్షమ్మకు వెండి వస్తువు బహుకరణ

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ అమ్మవారికి శుక్రవారం వెండి వస్తువును బహుకరించారు. పొదలకూరు వాస్తవ్యులు కర్ణం కామాక్షి ఆర్థ్య, పేరున కర్ణం కామాక్షి కార్తిక్ శ్రీ స్వామి అమ్మవార్ల పై భక్తి తో నిత్య ఆర్జిత సేవల్లో ఉపయోగించిటకు సుమారు 94 గ్రాములు విలువైన వెండి వస్తువును అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దర్శనం కల్పించారు.

February 20, 2026 / 07:30 PM IST

రేపు జరుగుమల్లిలో పర్యటించనున్న మంత్రి

ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం మంత్రి స్వామి స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. అనంతం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు అర్జీల సేకరణ ఉంటుందన్నారు.

February 20, 2026 / 07:30 PM IST